Abide With Me : బీటింగ్ రీట్రిట్‌లో మహాత్ముడికి ఇష్టమైన శ్లోకం తొలగింపు
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రీట్రిట్‌లో ఒక ఫేమస్ బీట్‌ను తొలగించారు. అదీ కూడా...

Republic Day
Mahatma Favourite Hymn: గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న సమయంలో..కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలో కొన్ని రాష్ట్రాల శకటాలను తిరస్కరించిన క్రమంలో..కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే..కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రీట్రిట్‌లో ఒక ఫేమస్ బీట్‌ను తొలగించారు. అదీ కూడా జాతిపిత మహాత్మా గాంధీకి ఇష్టమైన శ్లోకం . బీటింగ్ రీట్రీట్ ముగింపు వేడుకల్లో ఇదివరకు “అబిడ్ విత్ మి” అనే గంభీరమైన శ్లోకం వినిపించేంది. ఇదీ శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు దీని స్థానంలో…మేరే వతన్ కే లోగోన్…అనే పాటను చేర్చారు.
Read More : Pullalacheruvu : గ్రామాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు..ఎక్కడో తెలుసా ?
అబైడ్ విత్ మీ అనేది ఒక క్రిస్టియన్ కీర్తన. ఈ ప్రేయర్‌ను స్కాటిష్ ఆంగ్లికన్ హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ 1847లో రాశారు. దీనికి విలియం హెన్రీ మాంక్ స్వరాలు సమకూర్చారు. ఈ కీర్తన మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టం. దీనిని 1950 నుంచి ప్రతి గణతంత్ర వేడుక బీటింగ్ రీట్రీట్‌లో ప్రదర్శిస్తుంటారు. గతేడాది తొలిసారిగా ఈ పాటను బీటింగ్ రీట్రీట్ నుంచి తొలగించారు. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ చేర్చారు. తాజాగా, మరోమారు ఈ పాటను కేంద్రం తొలగించింది.
Read More : TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్
ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 29వ తేదీన ముగుస్తాయి. ఈ రోజున కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఎయిర్ ఫోర్స్, ఇతర బలగాలు డ్రమ్స్ బ్యాండ్, సన్నాయిలతో పాటలను ప్రదర్శిస్తుంటారు. సారే జహా సే అచ్చా పాటతో కార్యక్రమం ముగుస్తుంది. బీటింగ్ రీట్రీట్ రోజున ప్రదర్శించడానికి కేంద్ర ప్రభుత్వం 26 పాటలను ఎంపిక చేసింది. ఇందులో అబైడ్ విత్ మీ అనే పాట లేదు.
Read More : TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్
మరోవైపు…ఢిల్లీలోని అమర జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకం దగ్గరున్న జ్వాలలో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇండియా గేట్ దగ్గర 50 ఏళ్లుగా బ్రేక్ లేకుండా వెలిగిన అమర జవాన్ జ్యోతి.. 2022 జనవరి 21, శుక్రవారం రోజుతో కనుమరుగైంది. ఆ జ్యోతిలోని కొంత భాగాన్ని టార్చ్ లా తీసుకెళ్లి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో విలీనం చేశారు. అమర జవాన్ జ్యోతి విలీనంపై.. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సహా.. కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాజాగా పాటను తొలగించడంపై ఎలాంటి విమర్శలు చెలరేగుతాయో చూడాలి.