TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్

అమరావతిలోని మద్దూర్‌ సెంటర్‌లో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

TDP-YCP Clash : టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. అమరావతిలో టెన్షన్

Clash

Clash between TDP and YCP leaders : గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అవినీతిపై చర్చకు రావాలంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అమరావతిలోని మద్దూర్‌ సెంటర్‌లో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘర్షణకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపైనా ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణకు దారి తీసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు క్యాసినో రాజకీయాలు కృష్ణా జిల్లా గుడివాడ వీధులు రణరంగాన్ని తలపించాయి. జనవరి 21న క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లడం, దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు తీసిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో గుడివాడ వీధులు అట్టుడికి పోయాయి.

Illegal Constructions : అక్రమ కట్టడాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం.. 82 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రాళ్ల దాడిలో టీడీపీ నేత బోండా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులే కారు అద్దాలు పగలగొట్టించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక పోటాపోటీ ర్యాలీల సమయంలో బోండా ఉమా సహా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.