AP Smart Ration Cards: ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. డేట్ ఫిక్స్.. మొదట ఈ 9 జిల్లాల్లోనే..
మొదటి విడతలో 53 లక్షలు, రెండవ విడతలో 23.70 లక్షలు, మూడవ విడతలో 23 లక్షలు, నాల్గవ విడతలో 46 లక్షలు..

AP Smart Ration Cards: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి తేదీ ఫిక్స్ చేశారు. తొలుత 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు.
ఈ నెల 25న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ముందుగా 9 జిల్లాలో పంపిణీ చేస్తారు. కార్డుల పంపిణీ పూర్తిగా ఉచితం.
విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తారు.
మొత్తం నాలుగు విడతల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.
ఇక ఆగస్టు 30వ తేదీ నుండి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుండి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
సెప్టెంబర్ 15 నుండి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
మొదటి విడతలో 53 లక్షలు, రెండవ విడతలో 23.70 లక్షలు, మూడవ విడతలో 23 లక్షలు,
నాల్గవ విడతలో 46 లక్షలు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు.
ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏటీఎం కార్డ్ సైజులో ఉంటుంది. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది సేఫ్టీ ఫీచర్. ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ ఉంటాయి.
ఈ కార్డ్ పై గతంలో కన్నా చాలా క్లియర్ గా అక్షరాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
గతంలో రేషన్ కార్డ్ పెద్దదిగా ఉన్నా అందులో పేర్లు, వివరాలు ఏవీ స్పష్టంగా కనిపించేవి కాదన్నారు.
కొత్తగా ఇచ్చే స్మార్ట్ రేషన్ కార్డుల్లో అధిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల మోసాలకు అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ఏపీలో రెండు కొత్త ఏయిర్‌పోర్టులు.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే.. అందుబాటులోకి ఎప్పుడంటే..?