BJP Leader: బీజేపీ లీడర్ పేరు రాసి.. మహిళా మోర్చా సభ్యురాలి సూసైడ్

బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు పలక్కడ్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి స్థానిక బీజేపీ నాయకుడే కారణమంటూ అందులో పేర్కొంది. పలక్కడ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.

BJP Leader: బీజేపీ లీడర్ పేరు రాసి.. మహిళా మోర్చా సభ్యురాలి సూసైడ్

Woman Suicide

Updated On : July 11, 2022 / 3:41 PM IST

 

 

BJP Leader: బీజేపీ మహిళా మోర్చా సభ్యురాలు పలక్కడ్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి స్థానిక బీజేపీ నాయకుడే కారణమంటూ అందులో పేర్కొంది. పలక్కడ్ పోలీస్ సీనియర్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. సెక్షన్ 174 ప్రకారం.. క్రిమినల్ కేసుపై సమాచారం రాబడుతున్నామని తెలిపారు.

ఎఫ్ఐఆర్‌లో స్థానిక బీజేపీ నాయకుడి పేరు ఎంటర్ చేయలేదని.. విచారణకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. బాధితురాలు సోదరుడు టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. తన సోదరి బీజేపీ నాయకుడి పేరు ప్రస్తావించిందని, అతనే దీనికి కారణమని ఆరోపణలు గుప్పించాడు.

మిగతా కొందరు మహిళలు కూడా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నారని, వీటన్నిటి వెనుక ఆ బీజేపీ లీడర్‌యే ఉన్నాడని పేర్కొన్నారు. బాధితురాలు అదే నియోజకవర్గంలో మహిళా మోర్చా ట్రెజరర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read Also: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త