ఎన్నికల సమయంలో: కొత్త అసెంబ్లీలో భారీ అగ్నిప్రమాదం

  • Published By: vamsi ,Published On : December 5, 2019 / 04:35 AM IST
ఎన్నికల సమయంలో: కొత్త అసెంబ్లీలో భారీ అగ్నిప్రమాదం

Updated On : December 5, 2019 / 4:35 AM IST

జార్ఖాండ్‌ రాష్ట్రంలో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అక్కడ నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖాండ్‌లోని అసెంబ్లీలో మూడవ అంతస్థులో అగ్ని ప్రమాదం జరగగా.. భారీగా ఫైరింజన్లు సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపుచేశాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

అయితే అగ్నిప్రమాదం జరిగే సమయానికి అందులో పనిచేసే అందరూ ఇళ్లకు వెళ్లిపోవడంతో ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదు. 

అసెంబ్లీ భవనంలోని పశ్చిమ భాగంలో ప్రతిపక్ష నాయకుల కార్యాలయాలు గదులు ఉండగా.. అవి మంటల్లో పూర్తిగా ధ్వంసం అయ్యాయి.