Opposition meet: విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి పట్నాకు మమతా బెనర్జీ.. కీలక వ్యాఖ్యలు

విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు.

Opposition meet: విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి పట్నాకు మమతా బెనర్జీ.. కీలక వ్యాఖ్యలు

Mamata Banerjee

Updated On : June 22, 2023 / 5:15 PM IST

Opposition meet – Mamata Banerjee: బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కూటమిని ఏర్పాటు చేసి, లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections 2024) పోటీ చేయాలన్న ఉద్దేశంలో విపక్షాలు నిర్వహిస్తున్న సమావేశంలో ఏయే పార్టీల అధినేతలు పాల్గొంటారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సమావేశంపై స్పందించారు.

బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరగనున్న విపక్షాల సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

మణిపూర్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని చాలా ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. మణిపూర్ లో హింసపై కేంద్ర మంత్రి అమిత్ షా జూన్ 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి టీఎంసీ తరఫున తమ రాజ్యసభ పక్ష నాయకుడు డెరెక్ ఒబ్రియన్ హాజరవుతారని తెలిపారు. కాగా, శుక్రవారం విపక్షాలు నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనడానికి మమతా బెనర్జీ ఇవాళ పట్నా చేరుకున్నారు.

Manipur violence @ 50 Days : 50 రోజులుగా మండుతున్న మణిపూర్ .. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం