Mamata Banerjee: కోవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మమతా బెనర్జీ సోదరుడు మృతి
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లోనే శనివారం ఉదయం మృతి చెందారు.

Mamata Banerjees Brother Dies Of Covid Related Complications
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కొవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లోనే శనివారం ఉదయం మృతి చెందారు. ‘కొవిడ్ పాజిటివ్ వచ్చిన అతనికి ట్రీట్మెంట్ అందిస్తుండగానే ఇలా జరిగింది’ అని మెడికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఛైర్మన్ డా. అలోక్ రాయ్ అన్నారు.
కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. వెస్ట్ బెంగాల్ లో గడిచిన 24గంటల్లో 20వేల 846 తాజా కేసులు నమోదు కాగా, 136మంది పేషెంట్లు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.94 లక్షల కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియాలో 79.7శాతం కేసులు యాక్టివ్ గా ఉన్న 12రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. గడిచిన 24గంటల్లో ఇండియాలో 3.26లక్షల కేసులు నమోదుకాగా, మొత్తం కేసులు 2.43 కోట్లకు చేరాయి. ప్రాణాంతక వైరస్ తో 3వేల 890మంది ప్రాణాలు కోల్పోయారు.