Mumbai : సెక్రటేరియట్ రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వలలో పడి బతికిపోయాడు!

సెక్రటేరియట్ రెండో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. ఎక్కడ? కారణం ఏంటంటే?

Mumbai : సెక్రటేరియట్ రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వలలో పడి బతికిపోయాడు!

Mumbai

Updated On : September 26, 2023 / 6:58 PM IST

Mumbai – Safety net : మహారాష్ట్ర సెక్రటేరియట్ పై అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. భద్రతా వలయంలో (వలలతో ఏర్పాటు) చిక్కుకున్న అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ముంబయిలో డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

మహారాష్ట్ర సెక్రటేరియట్ రెండో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. భద్రతావలయంగా ఉన్న నెట్‌లో‌కి పడిన అతనిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో కొన్ని పత్రాలు ఉన్నాయి. టీచర్ పోస్టులు భర్తీ చేయమని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Also Read: ముంబయి కళాశాలలో బురఖా, హిజాబ్‌పై ఆంక్షలు

పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన జరిగిన సమయంలో సచివాలయం వెలుపల భారీ సంఖ్యలో వ్యక్తులు గుమిగూడారు. గత నెలలో డ్యామ్ ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు మహారాష్ట్ర సచివాలయంలోని మొదటి అంతస్తులోని భద్రతావలయంపైకి దిగినట్లు పిటిఐ వెల్లడించింది. ఆ ఘటనలో పోలీసులు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వరుస సంఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సచివాలయ ప్రధాన భవనంలో భద్రతా వలయాలను ఏర్పాటు చేసారు. కొన్నేళ్ల క్రితం భవనం లాబీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నైలాన్ సేఫ్టీ నెట్‌ను అమర్చినట్లు తెలుస్తోంది.