ఏం కర్మరా బాబూ, పోసుకుందామని BMW ఆపాడు, కట్ చేస్తే కారు లేదు..
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏ నిమిషానికి ఏం జరుగునో అని అనేది అందుకే. అతడిది దురదృష్టమో మరో కారణమో తెలియదు కానీ, అతడి BMW కారుని దొంగలు పట్టుకుపోయారు. మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన కారు ఆపాడు. అంతే, ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలియదు కానీ, దొంగలు పడ్డారు. BMW కారుతో పరార్ అయ్యారు.
యూరిన్ అర్జంట్ అయ్యింది:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో శనివారం(మార్చి 14,2020) రాత్రి ఫేస్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్టార్ 90 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి పేరు రిషబ్ అరోరా. వృత్తి స్టాక్ బ్రోకర్. రిషబ్ ఓ పార్టీకి అటెండ్ అయ్యాడు. పార్టీ అంటే మందు తాగడం కామన్ కదా. రిషబ్ కూడా పెగ్గేశాడు. కొంచెం ఓవర్ గానే వేసినట్టు ఉన్నాడు. దీంతో కొంత మత్తెక్కింది. పార్టీ అయిపోయాక రిషబ్ తన BMW కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంతలో దారిలో అతడికి యూరిన్ అర్జంట్ అయ్యింది. ప్రకృతి పిలుపు రావడంతో వెంటనే రోడ్డు పక్కన కారు ఆపాడు. ఇంతలో కొందరు దుండగులు ఊడిపడ్డారు. కారుతో పరార్ అయ్యారు.
See Also | నెరవేరేనా : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం – బండి సంజయ్
బైక్ పై ఫాలో అయిన దొంగలు:
ఈ ఘటనతో రిషబ్ షాక్ తిన్నాడు. అతడికి కిక్కు దిగింది. కాసేపటికి తేరుకున్న రిషబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కారు చోరీ అయ్యిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. కొందరు దుండగులు బైక్ పై వచ్చారని, తనకు గన్ గురి పెట్టి బెదిరించారని, ఆ తర్వాత కారులో పారిపోయారని చెప్పాడు. ఆ లగ్జరీ కారు తన బావదని, దానిపై రూ.40లక్షల లోన్ పెండింగ్ ఉందని రిషబ్ తెలిపాడు.
సీరియస్ గా తీసుకున్న పోలీసులు:
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పక్కా పథకం ప్రకారమే చోరీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ బైక్ పై రిషబ్ ని ఫాలో అయిన దుండగులు, ఛాన్స్ చిక్కగానే పని కానిచ్చారని అంటున్నారు. కాగా ఆ సమయంలో రిషబ్ బాగా తాగిన మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో దొంగల పని సులువైందన్నారు. ఈ కేసుని పోలీసుల సీరియస్ గా తీసుకున్నారు. కారుని వెంబడించి, గన్ గురి పెట్టి బెదిరించి, కారుని చోరీ చేయడం సాధారణ విషయం కాదంటున్నారు. కారు ఖరీదు కోటి రూపాయలు ఉండొచ్చని అంచనా వేశారు.
See Also | ముగియనున్న టి. అసెంబ్లీ సమావేశాలు : నేడు CAAపై వ్యతిరేక తీర్మానం