Punjab Patiala Gurudwara : పంజాబ్ పాటియాలా గురుద్వారాలో దారుణం.. మద్యం సేవించిన మహిళను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి

మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకునే లోపే నిర్మల్ జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్ తో సదరు మహిళపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.

Punjab Patiala Gurudwara : పంజాబ్ పాటియాలా గురుద్వారాలో దారుణం.. మద్యం సేవించిన మహిళను తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి

Patiala Gurudwara

Updated On : May 15, 2023 / 1:00 PM IST

Patiala Gurudwara : పంజాబ్ లోని పాటియాలా గురుద్వారాలో దారుణం జరిగింది. మద్యం సేవించిన మహిళను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఆదివారం సాయంత్రం 32 ఏళ్ల పర్మీందర్ కౌర్ అనే మహిళ పాటియాలాలోని దుక్నీవార్న్ సాహిబ్ గురుద్వారాలో ఉన్న సరోవర్ దగ్గర మద్యం సేవిస్తూ కనిపించారు.  అయితే ఆ సమయంలో అక్కడు ఉన్న నిర్మల్ జిత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళను కాల్చి చంపాడు.

మృతురాలు అర్బన్ ఎస్టేట్ ఫేజ్-1లో నివాసముంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకునే లోపే నిర్మల్ జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్ తో సదరు మహిళపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ – వ్యాన్ ఢీ, 26 మంది మృతి

అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, కాల్పులకు పాల్పడి వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ప్రాపర్టీ డీలర్ అని, అతనికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదని పోలీసులు పేర్కొన్నారు.