Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ – వ్యాన్ ఢీ, 26 మంది మృతి

మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని తెలిపారు. మృతులందరూ మెక్సికోకు చెందినవారేనని పేర్కొన్నారు.

Mexico Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ – వ్యాన్ ఢీ, 26 మంది మృతి

Mexico Road Accident

Updated On : May 15, 2023 / 9:09 AM IST

Road Accident : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీ, ప్యాసింజర్ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. తమౌలిపాస్ రాజధాని సియుడాడ్ విక్టోరియా సమీపంలోని హైవేపై ట్రాక్టర్ ట్రాలీ, ప్యాసింజర్ వ్యాన్ పరస్పరం ఢీకొన్నాయి.

ప్రమాదం జరగడంతో ట్రాక్టర్ ట్రాలీలో మంటలు చెలరేగాయి. అయితే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే ట్రాలీని తీసుకెళ్తున్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్ పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Kadapa Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా తాడిపత్రి వాసులు ..

ప్రయాణికులతో వెళ్తోన్న వ్యాన్ ప్రైవేట్ సంస్థకు చెందినదని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని తెలిపారు. మృతులందరూ మెక్సికోకు చెందినవారేనని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.