Mangaluru Torturing Man : దారుణం.. తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో..

మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన మత్స్యకారుడితో సహచర మత్స్యకారులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తలకిందులుగా వేలాడదీశారు. దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు.

Mangaluru Torturing Man : దారుణం.. తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో..

Mangaluru Torturing Man

Updated On : December 23, 2021 / 5:38 PM IST

Mangaluru Torturing Man : మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు అమానవీయంగా ప్రవర్తించారు. వైల శీను మంగళూరులో పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఫోన్ పోయింది. అది దొరక్కపోయేసరికి శీనునే దొంగిలించాడని భావించారు. దీంతో అతడిని తలకిందులుగా వేలాడదీశారు. దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Jaggery : బెల్లం అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?..

సిటీలోని బందర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. శీనుని ఓ క్రేన్ కి తలకిందులుగా వేలాడదీసి టార్చర్ పెట్టారు. శీనుని తలకిందులుగా వేలాడదీసి చిత్ర హింసలు పెడుతుండగా ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. కొండూరు పోలయ్య(23), అవుల రాజ్ కుమార్(26), మనోహర్(21), ఉటుకూరి జలయ్య(30), కర్పింగరి రవి(27), ప్రళయ కావేరి గోవిందయ్య(47) పోలీసుల అదుపులో ఉన్నారు. వీరంతా ఏపీకి చెందిన వారే.