ఢిల్లీలో షాకింగ్ ఘటన : కరోనా అంటూ యువతిపై ఉమ్మేశాడు

  • Published By: madhu ,Published On : March 24, 2020 / 01:30 AM IST
ఢిల్లీలో షాకింగ్ ఘటన : కరోనా అంటూ యువతిపై ఉమ్మేశాడు

Updated On : March 24, 2020 / 1:30 AM IST

ఓ వైపు కరోనా భయ పెడుతుంటే..కొన్ని షాకింగ్ ఘటను వెలుగు చూస్తున్నాయి. అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నాయి. అయితే..ఢిల్లీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి పట్ల 50 సంవత్సరాలున్న ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో కరోనా అంటూ ఉమ్మేసి పారిపోయాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. 

వివరాల్లోకి వెళితే…విజయనగర్ లో 25 సంవత్సరాలున్న మణిపూర్ యువతి…స్థానిక మార్కెట్ లో 2020, మార్చి 22వ తేదీ ఆదివారం నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళుతోంది. నడుచుకుంటూ వెళుతుండగా..50 సంవత్సరాలున్న ఓ వ్యక్తి..ఆమె దగ్గరకి వచ్చాడు. అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. దీనికి ఆ యువతి అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిఘటించింది. 

ఆ వ్యక్తి ఆమెపై ఉమ్మేసి..‘కరోనా’ అంటూ ఉమ్మేసి పారిపోయాడు. దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తెలిసింది. ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో అందరం ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వట్టర్ వేదికగా పోస్టు చేశారు. కరోనా వైరస్ పై పోరాడేందుకు ఇది చాలా అవసరం అన్నారు. 
 

See Also |  కరోనా కల్లోలం : 15 వేల మంది చనిపోయారు!