మనోధైర్య స్కీమ్: రేప్ బాధితులకు రూ.10లక్షల సాయం

మనోధైర్య స్కీమ్: రేప్ బాధితులకు రూ.10లక్షల సాయం

Updated On : November 7, 2019 / 4:40 AM IST

మహిళా శిశు సంక్షేమ శాఖ రేప్ బాధితుల సహాయార్థం రూ.10లక్షలు అందించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్ధి పొందేవారిని వెతికే పనిలో పడ్డారు. పుణెలో 32మంది అత్యాచార బాధితులు ఉండగా వారికి అందజేయాలని ప్రభుత్వం యత్నిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారు 2018వరకూ పూణె జిల్లాలో 236కేసులు ఉన్నట్లు గుర్తించారు. 

అత్యాచారం, యాసిడ్ బాధితులు ఈ కోవలోకి వస్తారు. అక్టోబరు 2013లో మొదలైన ఈ స్కీం తొలి నాళ్లలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండేది. బొంబే హైకోర్టు ఆదేశాలనుసారం ఆ తర్వాత రూ.10లక్షలుగా మారింది. వీరిలో మనో ధైర్య స్కీం పొందేందుకు అర్హులుగా 65మంది ఎంపికయ్యారు. కొందరి ఆచూకీ దొరకగా 32మంది చిరునామా తెలియాల్సి ఉంది. ఇందులో 14మంది తమకు ఎటువంటి పరిహారం అవసర్లేదని తోసిపుచ్చారు. 

అత్యాచారానికి గురైన వారి చిరునామా తెలుసుకోవడం కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే వారు ఆ ప్రదేశం వదిలి వేరే చోటుకు వెళ్లినప్పుడు తప్పుడు చిరునామా ఇస్తుంటారు. బాధితులు ఒకవేళ చనిపోయి ఉంటే కోర్టు ఆదేశాల ప్రకారం.. దీని నుంచి మినహాయిస్తాం. అక్టోబరు చివరి వారం రాష్ట్ర ప్రభుత్వం మరో ఆర్డర్ రిలీజ్ చేసింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.73కోట్లు కేటాయించింది.