మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే!

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 02:40 AM IST
మనోహర్ పారికర్ భార్య కూడా క్యాన్సర్‌తోనే!

మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.. క్యాన్సర్ కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2000సంవత్సరంలో పారికర్ భార్య కూడా క్యాన్సర్ వ్యాధి కారణంగానే చనిపోయారు. 2000 సంవత్సరం అక్టోబర్‌లో తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలు చేపట్టగా 2000సంవత్సరంలోనే మే నెలలో పారికర్ తన భార్యను కోల్పోయారు.
Read Also : గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

మనోహర్ పారికర్, మేధా 1979 జూన్ 2న పెళ్లి చేసుకోగా వీరికి ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 40ఏళ్ల వయసులోనే తన భార్య తనను వదిలి వెళ్లిందంటూ మనోహర్ పారికర్ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే తన భార్య చనిపోయిన వ్యాధితోనే మనోహర్ చనిపోవడం గమనార్హం.
Read Also : గోవా సీఎం పారికర్ కన్నుమూత