Maoist Leader Hidma Arrest: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్టు
మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు.

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
Kunjam Hidma: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలో జిల్లా వాలంటరీ ఫోర్స్ ను ఉపయోగించి హిడ్మాను పట్టుకొన్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. వరుసగా మావోయిస్టులను ఏరివేస్తోంది. ఇటీవల మావోయిస్టు అగ్రనేత బసవరాజు సహా 30 మందికి పైగా మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కొందరు మావోయిస్టు అగ్ర నేతలు తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని పోలీసులకు సమాచారం అందిస్తున్నట్టు ప్రచారం జరిగింది ఈ క్రమంలో పోలీసులు హిడ్మాను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కోరాపుట్ జిల్లాలో హిడ్మాను అరెస్ట్ చూపించారు పోలీసులు. అతడి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్గూడ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో హిడ్మాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
ఎవరీ హిడ్మా?
మావోయిస్టు వర్గాల్లో హిడ్మాగా పేరుపొందిన కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మూడు రాష్ట్రాల ఉమ్మడి యాంటీ-నక్సల్ ఆపరేషన్‌లో సీనియర్ మావోయిస్టు నాయకుడు కుంజమ్ హిడ్మాను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని వద్ద ఒక AK-47 రైఫిల్, 35 రౌండ్ల మందుగుండు సామగ్రి, 117 డిటోనేటర్లు (ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్), గన్‌పౌడర్, రేడియోలు, కత్తులు,మావోయిస్టు సాహిత్యం సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.