నూడుల్స్ విభాగంలో మారికో, సఫోలా మసాలా

Saffola Oodles : ఐదు నిమిషాల్లో నూడుల్స్..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటుంటారు. నెస్లే మ్యాగీ, యిప్పీ నూడుల్స్ ప్రస్తుతం ఉండగా..ఇందులో మరొకటి వచ్చి చేరింది. ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ మారికో లిమిటెడ్, సఫోలా ఊడిల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా..నూడుల్స్ ఉంటాయని, కూరగాయల కలయికతో తయారు చేశామని కంపెనీ వెల్లడించింది. రుచికరమైన, ఆరోగ్యకరంగా ఉంటుందని, కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సమయం పడుతుందని తెలిపింది.
రెడీ టూ ఈట్ స్నాకింగ్ మార్కెట్ లో ప్రధానమైందని, ఇన్ స్టంట్ నూడుల్స్ కేటగిరీలో సఫోలా ఊడిల్స్ ను ప్రారంభించామని Koshy George (Chief Marketing Officer) తెలిపారు. అమెజాన్, బిగ్ బాస్కెట్, Grofers, ప్లిఫ్ మార్కెట్ లలో లభిస్తుందని, 46 గ్రాములు ఉండే ఈ ప్యాకెట్ ధర రూ. 20 నిర్ణయించడం జరిగిందన్నారు. 184 గ్రాములు ఉండే ప్యాక్ ధర రూ. 80 ఉంటుందన్నారు. కరోనా సమయంలో…ప్యాకేజ్ కు ఫుడ్స్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఉంటూ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. మ్యాగీ నూడుల్స్, మంచ్, కిట్‌క్యాట్ చాక్‌లెట్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేసినా సరే ఈ – కామర్స్‌దే హవా నడుస్తోంది. ఐటీసీ ఉత్పత్తులైన సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, ఆశీర్వాద్ పిండి ఆన్‌లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. గత కొద్దికాలంగా..చాలా మంది ప్రజలు ఇండ్లలోనే వండుకోవడానికి, తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.