25 ఏళ్లుగా గొంతులో విజిల్ పెట్టుకుని తిరుగుతున్న మహిళ..!!

Mattannur woman : ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 25 సంవత్సరాల నుంచి దగ్గు సమస్యతో బాధ పడుతోంది. ఎన్ని మందులు వాడినా..తగ్గడం లేదు. అసలు కారణం..తెలుసుకున్న ఆమె..షాక్ కు గురైంది. గొంతులో విజిల్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చివరకు వైద్యులు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేయడంతో హమ్మయ్యా అంటూ..ఊపిరిపీల్చుకుంది. కేరళ రాష్ట్రంలో కన్నూరు జిల్లా మట్లన్పూర్ కు చెందిన మహిళ (45) శ్వాసకోశ సమస్య, దగ్గుతో బాధ పడుతోంది. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉండేది. ఇలా 25 ఏళ్లుగా బాధ పడుతోంది.
కన్నూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చి తాను ఎదుర్కొంటున్న సమస్యను వివరించింది. Dr Jaffer Basheer నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం Dr Rajeev Ram కు విషయాన్ని తెలియచేశారు. తర్వాత…Pariyaram Medical College Hospital కు పంపించారు. శ్వాస నాళంలో చిన్నపాటి ప్లాస్టిక్ విజిల్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియచేశారు.
తాను విజిల్ ఎప్పుడు మింగాలో అర్థం కాలేదు. 15 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుకున్నారు. ఆమె గొంతుకు శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ధారించారు. Dr Jaffer Basheeer, Dr Rajeev Ram, Dr D K Manoj, and Dr K V Padmanabhan, ఇతర వైద్య బృందం…ఆపరేషన్ చేసి విజిల్ ను తొలగించారు. గత 20 ఏళ్లుగా విజిల్ కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు ప్రస్తుతం ఉపశమనం లభించినట్లైంది.