Punjab Polls : పంజాబ్ లోక్ కాంగ్రెస్.. ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితా..
పంజాబ్ లోక్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.

Election Update Today
Punjab Polls : ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలతో రాజకీయ వాతావరణం వేడుక్కుతోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ నేృతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతోంది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ జనవరి 29న (శనివారం) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులను పంజాబ్ లోక్ కాంగ్రెస్ ఖరారు చేసింది.
మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ కూటమిలో బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 37 స్థానల్లో బరిలోకి దిగుతోంది. అలాగే శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడుతోంది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఒప్పందం చేసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
Punjab Lok Congress releases a list of 7 candidates for the upcoming #PunjabAssemblyelections2022 pic.twitter.com/yHROpkFxs3
— ANI (@ANI) January 29, 2022
ఎగ్జిక్యూటివ్ పోల్స్‌పై ఈసీ నిషేధం..
మరోవైపు.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోల్స్‌ను ఈసీ నిషేధించింది ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్‌ను ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈసీ స్పష్టం చేసింది.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణ లేదా ప్రచారాన్ని ఫిబ్రవరి 10 ఉదయం 7.00 నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు నిషేధించినట్టు యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అజయ్ కుమార్ శుక్లా వెల్లడించారు. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించనున్నట్టు తెలిపారు.
Read Also : Padmarajan : 226 సార్లు ఓటమి.. అయినా తగ్గేదేలే.. 227వ సారి ఎన్నికల బరిలోకి..