Padmarajan : 226 సార్లు ఓటమి.. అయినా తగ్గేదేలే.. 227వ సారి ఎన్నికల బరిలోకి..

1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయిపై లక్నోలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశారు.

Padmarajan : 226 సార్లు ఓటమి.. అయినా తగ్గేదేలే.. 227వ సారి ఎన్నికల బరిలోకి..

Election King Padmarajan

Padmarajan : 50 కాదు 100 కాదు.. ఏకంగా 200 సార్లు ఎన్నికల బరిలో నిలిచారు. అన్నిసార్లు పోటీలో నిలవడం ఒక విశేషం అయితే.. అన్నిసార్లూ ఓడిపోవడం మరో ఆసక్తికర అంశం. అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా.. తగ్గేదేలే అంటున్నారు. తాజాగా 227వ సారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనే కె.పద్మరాజన్. తమిళనాడులో ఎలక్షన్ కింగ్ గా పేరుగాంచిన పద్మరాజన్.. లేటెస్ట్ గా 227వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Unstoppable with NBK: రెండో సీజన్‌కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

ఫిబ్రవరి 19న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు పద్మరాజన్. పోటీకి సంబంధించి ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా.. అందరి కన్నా ముందే పద్మరాజన్ పత్రాలు దాఖలు చేశారు. అత్యధికసార్లు పోటీ చేసి రికార్డులకు ఎక్కిన పద్మరాజన్.. అత్యధిక సార్లు ఓడిపోయి కూడా రికార్డులకెక్కారు.

Reliance Jio 5G speed: ఒక్క నిమిషంలో రెండు గంటల సినిమా డౌన్‌లోడ్ చేయవచ్చు

1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయిపై లక్నోలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేశారు. 62 ఏళ్ల పద్మరాజన్ ప్రస్తుతం వీరక్కల్ పూడూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.