Medical Student : పరీక్షల్లో ఫెయిల్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో MBBS సెకండ్ ఇయర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Medical Student : పరీక్షల్లో ఫెయిల్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Medical Student

Updated On : December 31, 2021 / 9:41 AM IST

Medical Student : ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో MBBS సెకండ్ ఇయర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దివ్యా(19)గా గుర్తించారు పోలీసులు. అయితే డిసెంబర్ 29న పరీక్షల ఫలితాలు విడుదల కాగా దివ్య రెండు సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు ఆమె స్నేహితురాలు పోలీసులకు తెలిపింది.

చదవండి : KTR Medical Devices Park : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ-కేటీఆర్

ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె కొంచం బాధగా కనిపించినట్లు వివరించింది. ఫెయిల్ అయ్యాననే బాధలోనే దివ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Actress Commits Suicide : నటి ఆత్మహత్య-డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని నకిలీ అధికారుల బెదిరింపు