KTR Medical Devices Park : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ-కేటీఆర్

ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు సమీపంలోని సుల్తాన్ పూర్ లో

KTR Medical Devices Park : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ-కేటీఆర్

Ktr Medical Devices Park

KTR Medical Devices Park : ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు సమీపంలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులోని 7 లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలను మంత్రి ప్రారంభించారు. తద్వారా 265 కోట్ల పెట్టుబడిని, 1300 ఉద్యోగాలను ఈ కంపెనీలు కల్పించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 2030 నాటికి తెలంగాణను 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక కీలక ముందడగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

సుల్తాన్‌పూర్‌లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన స్టెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కంపెనీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్, మే వ‌ర‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. మెడిక‌ల్ డివైజెస్ రంగంలో భార‌త‌ దేశానికి తెలంగాణ ఓ కేంద్రంగా మారాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

సుల్తాన్‌పూర్‌లో నెల‌కొల్పిన మెడిక‌ల్ డివైజ్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌ దేశంలోనే అతిపెద్దది. సుమారు 50 కంపెనీలు ఈ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్‌లో భూములు తీసుకుని ప‌నులు ప్రారంభించాయ‌ని తెలిపిన మంత్రి, వాటిలో ఏడు కంపెనీలు ఇప్ప‌టికే ప్రారంభ‌మైన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో మ‌రికొన్ని కంపెనీలు ప్రారంభంకానున్నాయ‌ని చెప్పారు. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ మ‌రింత బ‌లోపేతం కానుంద‌ని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒకే రోజు ఏడు ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. హువెల్ లైఫ్ సైన్సెన్‌, ఎస్‌వీపీ టెక్నో ఇంజ‌నీర్స్‌, ప్రొమియా థెరాప్యూటిక్స్, ఆకృతి ఒకులోప్లాస్టీ, ఎల్వికాన్ అండ్ డీస్‌మెలైఫ్, అర్కా ఇంజ‌నీర్స్‌ సంస్థ‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

”అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. లైఫ్ సైన్సెన్స్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ ఎదిగింది. వ పారిశ్రామిక వేత్త‌లు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ముందుకొచ్చే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం రాయితీలు ఇస్తోంది. నాలుగేళ్ల కింద‌ట నేను ప్రారంభించిన మెడిక‌ల్ డివైజ్ పార్క్ నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంది” అని కేటీఆర్ అన్నారు.

Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. పంపడానికి ముందే చెక్ చేసుకునేలా

”నాలుగేళ్లలో మెడికల్ డివైజెస్ పార్కులో పెద్దఎత్తున పరిశ్రమల రావడం సంతోషంగా ఉంది. 50 కంపెనీలు, రూ.1424 కోట్ల పెట్టుబడులు, 7వేల ఉద్యోగాలు లక్ష్యంగా మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశాము. ఇత‌ర దేశాల నుంచి భారత్ 78 శాతం మెడిక‌ల్ ప‌రిక‌రాల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు జీవ ఔషధ రంగంలో తెలంగాణ ను హబ్ చేయాలని చూస్తున్నాము. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ సంస్థ మెడికల్ డివైజెస్ పార్కులో నిర్మాణం లో ఉంది. భారత దేశానికే మెడికల్ డివైజెస్ తయారీ కేంద్రంగా సుల్తాన్ పూర్ ఉంటుంది” అని కేటీఆర్ అన్నారు.