ట్రంప్‌ భార్యకు ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్‌ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్….

ట్రంప్‌ భార్యకు ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్‌ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్….

Updated On : February 25, 2020 / 7:13 AM IST

అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్.. ఢిల్లీ గవర్నమెంట్స్ స్కూల్స్ కు వెళ్లారు. సౌత్ ఢిల్లీలోని మోతీ భాగ్ ప్రాంతంలో ఉన్న స్కూల్‌లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఓ చిన్నారి తిలకం దిద్ది హారతిచ్చి ఆమెకు స్వాగతం పలికింది. డొనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తుండగా మెలానియా ఒంటరిగా సందర్శించారు. 

వైట్ కలర్ మిడ్డీతో తెలుపు, ఎరుపు రంగు పూలున్న డ్రెస్ వేసుకుని స్కూల్లో గడిపారు మెలానియా. ముందుగానే గంటపాటు స్కూల్ కు వెళ్లే ప్రోగ్రాంను ప్లాన్ చేసుకున్న మెలానియాకు సెక్యూరిటీని ప్రత్యేకంగా నిర్వర్తించారు. చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి రూట్ ప్లాన్ చేశారు. ఆ దారిని గతంలో లేని విధంగా కొత్త పెయింట్లతో.. రిపైర్ చేయించి ముస్తాబు చేశారు. దారికి ఇరు వైపులా ఉన్న చెట్ల ఆకులను షేపులా తీర్చి దిద్దారు. 

ఆవిడ రాకకోసం స్కూల్ టీచర్లంతా ప్రత్యేక రంగుల దుస్తుల్లో రెడీ అయ్యారు. 2018లో ఢిల్లీ ప్రభుత్వం మొదలుపెట్టిన హ్యాపీనెస్ క్లాసులను ఆమె అడిగి తెలుసుకున్నారు. మెడిటేషన్, వీధుల్లో ఆటలు, ఒత్తిడిని తగ్గించేందుకు చిట్కాలు వంటివి ఈ క్లాసుల్లో చెబుతారు. హ్యాపీనెస్ సెషన్ లో భాగంగా విద్యార్థుల్లో పలు రకాల యాక్టివిటీలు చేయించారు. 

See Also>>హ్యాపీనెస్ క్లాసులంటే ఏంటి..ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ కు మెలానియా రావాలనుకోవడానికి కారణం!

 

పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. డ్యాన్స్ కార్యక్రమాలు, ప్రత్యేక క్లాసులు నిర్వహించడంతో అవి చూసిన మెలానియా మురిసిపోయారు. స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మెలానియా.. ‘నమస్తే! ఇది బ్యూటిఫుల్ స్కూల్. నాకు సంప్రదాయ పద్ధతిలో డ్యాన్స్ చేసి వెల్‌కమ్ చెప్పినందుకు థ్యాంక్స్. భారత్‌లో ఇది నా తొలి పర్యటన. ఇక్కడి ప్రజలు చాలా సహృదయంతో స్వాగతం చెబుతున్నారు’ అన్నారు. 

ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారిక సమాచారం ఇవ్వకపోవడంపై తలెత్తిన ప్రశ్నలకు యూఎస్ గవర్నమెంట్‌‍ను సమాధానం వచ్చింది. ఈ ఈవెంట్‌ను రాజకీయం చేయకూడదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు నేతలూ హాజరైనా అభ్యంతరం లేదని,  ఇది రాజకీయ కార్యక్రమం కాకూడదని ఆయన పేర్కొన్నారు.