యూపీలో బ్లీచ్ స్ప్రే, కేరళలో సోప్ వాటర్..ఏదైనా..వలస కూలీలే.. అమానుషం

కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 01:57 AM IST
యూపీలో బ్లీచ్ స్ప్రే, కేరళలో సోప్ వాటర్..ఏదైనా..వలస కూలీలే.. అమానుషం

Updated On : March 31, 2020 / 1:57 AM IST

కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు

కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక, తినడానికి తిండి దొరక్క తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. పనులు లేకపోవడంతో నగరాల్లో ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక నరకం చూస్తున్నారు. కొందరైతే వందల కిలోమీటర్ల కాలినడకన సొంత గ్రామాలకు వెళ్తున్నారు. రాత్రింబవళ్లు నడిచి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. ఎలాగోలా సొంత రాష్ట్రానికి చేరుకున్న వారికి కొన్నిచోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. 

కరోనా అనుమానంతో వలస కూలీలపై రసాయనాలు పిచికారీ:
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వలస కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఎవరికైనా కరోనా ఉండొచ్చు అనే అనుమానంతో అధికారులు ముందుగా వారందరిని రోడ్డుపై కూర్చోమన్నారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అందరిని కళ్లు, చెవులు మూసుకోమని అధికారులు చెప్పారు. ఏం జరుగుతుందో అర్థం కాక వారు కొంత ఆందోళన చెందారు. అధికారులు ఆదేశించడంతో రోడ్డుపై కూర్చుని కళ్లు, చెవులు, మూసుకున్నారు. అంతే ఒక్కసారిగా అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, కెమికల్స్(రసాయనాలు) పిచికారీ(స్ప్రే) చేశారు. పాపం వారంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

వలస కూలీలను మరింత బాధపెట్టొద్దు:
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనిపై ప్రియాంక గాంధీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”యూపీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా వైరస్‌పై మనందరం కలిసి కట్టుగా పోరాడుతున్నాం. కానీ ఇలాంటి అమానుష, అమానవీయ చర్యలకు పాల్పడొద్దు. వలస కార్మికులు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారిపై రసాయనాలు చల్లి మరింత బాధపెట్టవద్దు. రసాయనాలతో పిచికారీ చేస్తే వారి ఆరోగ్యానికి మరింత హాని జరిగే ప్రమాదముంది” అని ప్రియాంక వాపోయారు.

కేరళలో వలస కూలీలపై సోప్ వాటర్ స్ప్రే:
అటు కేరళ రాష్ట్రంలోనూ ఇలాంటి అమానుషమే జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి కేరళకు వచ్చిన వలస కూలీల పట్ల అధికారులు అమానవీయంగా ప్రవర్తించారు. కరోనా ఉందేమో అనుమానంతో వలస కూలీలపై సోప్ వాటర్ చల్లారు. దీనిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ముందు జాగ్రత్త కోసమే ఇలా చేశామని అధికారులు అంటున్నా, ఇది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. వాళ్లను మనుషుల్లా ట్రీట్ చేయాలని సూచిస్తున్నారు.
 

విమానాల్లో కరోనా అంటించుకుని వచ్చిన వారికి రాచమర్యాదలు:
వలస కార్మికులను ప్రస్తుతం ఉంటున్న చోటే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. అయితే కొందరు మాత్రం నగరాల్లో బతుకుదెరువు లేక సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో గంజి నీళ్లు తాగైనా బతకచ్చని వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. అలా వచ్చిన వారిని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉంచాలి. కానీ యూపీ అధికారులు అలా చేయకుండా.. అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి వారిపై రసాయనాలు చల్లారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

విదేశాల నుంచి విమానాల్లో కరోనా వైరస్ తీసుకొచ్చిన వారికి రాచ మర్యాదలు చేస్తున్న ప్రభుత్వాలు.. వలస కార్మికుల పట్ల మాత్రం ఇంత అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించడం దారుణం అని మండిపడుతున్నారు. మరోసారి ఇలాంటి ఘోరాలు రిపీట్ అవకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read | గిరిజనుల కోసం అడవిలో కాలినడకన భుజాలపై నిత్యావసరాలను మోసుకెళ్లిన కలెక్టర్, ఎమ్మెల్యే