మార్చి 1 నుంచి పెరగనున్న పాల ధరలు.. లీటర్ ఎంతంటే?

మార్చి 1 నుంచి పెరగనున్న పాల ధరలు.. లీటర్ ఎంతంటే?

Updated On : February 26, 2021 / 10:51 AM IST

Milk Prices hike : దేశంలో ఒకవైపు ఇంధన ధరలు మండిపోతుంటే.. నిత్యవసరమైన పాల ధరలు కూడా అమాంతం పెరిగిపోనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల మాదిరిగానే పాల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒక లీటర్ పాల ధరపై రూ.12 వరకు పెరగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లమ్ సిటీలో పాల ధరలు పెరగనున్నాయి. 25 గ్రామాలకు చెందిన కూరగాయలు, పాల ప్రొడక్టుల ఉత్పత్తిదారులు ఫిబ్రవరి 23న రామ మందిర్ కాలిక మాత క్యాంపస్ లో పాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 1 నుంచి ఒక లీటర్ పాల రూ.55 వరకు పెంచాలని నిర్ణయించారు. వచ్చే నెల మార్చి మొదటి రోజు నుంచి ఈ కొత్త పాల ధరలు అమల్లోకి రానున్నాయి. అంటే. ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడింది. కానీ, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.