Minister Nitin Gadkari : వీఐపీల వాహనాలకు సంగీతం, సైరన్ ప్లేస్‌లో భారతీయ సంగీతం : మంత్రి నితిన్‌ గడ్కరీ

వీఐపీలం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి ట్రాఫిక్ లేకుండా రోడ్లపై దూసుకుపోవటం ఇకపై కుదరదు. ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం వినూత్నఆలోచనలతో ఇటువంటి వాటికి చెక్ పెట్టనుంది. ఇకనంచి వీఐపీ వాహనాలకు సైరన్లు వినిపించకుండా సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేయనుంది.

Minister Nitin Gadkari : వీఐపీల వాహనాలకు సంగీతం, సైరన్ ప్లేస్‌లో భారతీయ సంగీతం  : మంత్రి నితిన్‌ గడ్కరీ

VIP vehicles  play Indian music

Updated On : August 14, 2023 / 11:07 AM IST

VIP vehicles  play Indian music : ఇక నుంచి భారత్ లో వీఐపీ (VIP)వాహనాల నుంచి సైరన్ కాదు సంగీతం వినిపించనుంది. వీఐపీల వాహనాలు రోడ్లపై వెళుతుంటు కుయ్ కుయ్ మంటూ వినిపించే సైరన్ స్థానంలో ఇకనుంచి వీనుల విందైన సంగీతం వినిపించనుంది. అదికూడా భారతీయ సంప్రదాయమైన సంగీతం వినిపించనున్నాయి. మనం సాధారణంగా చూస్తుంటాం. రోడ్లపై వీఐపీలు వెళ్లే సమయంలో పోలీసులు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుంటారు. అలా రోడ్లపై సైరన్‌ మోతతో వాహనాలు వెళుతుంటే.. ఎవరో వీఐపీ వెళుతున్నారు అని మనకు తెలుస్తుంది. అలా ఇక నుంచి సైరన్ మోగకుండా సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Union Minister of Road Transport and Highways Nitin Gadkar)వెల్లడించారు.

ఈ మార్పులకు కారణం శబ్ధ కాలుష్యం తగ్గించటానికి ఓ కారణమైతే మరో కారణం కూడా లేకపోలేదు. కొంతమంది తాము వీఐపీలం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి ట్రాఫిక్ లేకుండా రోడ్లపై దూసుకుపోవటానికి తమ వాహనాలకు సైరన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటువంటివాటికి చెక్ పెట్టటానికి..అలాగే శబ్ధకాలుష్యం తగ్గించటానికి ఇక నుంచి వీఐపీల వాహనాలకు సైరన్లు కాకుండా సంగీతం వినిపించేలా మార్పులు చేయనున్నామని మంత్రి గడ్కరి వెల్లడించారు. వీఐపీలు వెళుతుంటే వారి వాహనాల సైరన్‌ మోతను వినసొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నామని మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌లతో కలిసి పుణెలోని చాందినీ చౌక్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Media Tree in Coimbatore : కోయంబత్తూరులో ఆకట్టుకుంటున్న మీడియా ట్రీ .. సెల్ఫీలతో సందడి చేస్తున్న నగరవాసులు

ఈ సందర్భంగా గడ్కరి మాట్లాడుతు..శబ్ద కాలుష్యాన్ని నియంత్రించటాని చాలా ముఖ్యమని అన్నారు. దీంట్లో భాగంగానే వీఐపీ వాహనాలపై ఉండే ఎర్ర బుగ్గ సంస్కృతికి ముగింపు పలికే అవకాశం నాకు లభించింది అని తెలిపారు. అలాగే వీఐపీ వాహనాల్లో సైరన్‌ను కూడా తొలగించాలనుకుంటున్నామని వెల్లడించారు. సైరన్‌కు బదులుగా భారతీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్‌,వీణ, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేసేందుకు నిబంధనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శబ్ద కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం అని మంత్రి గడ్కరీ తెలిపారు.

కాగా.. బహుళస్థాయి (Multi level) ఫ్లైఓవర్ల ప్రాజెక్టు అని పిలుబడే పూణెలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాందినీ చౌక్ ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ మొత్తం ప్రాజెక్టులో నాలుగు ఫ్లై ఓవర్లు, ఒక అండర్ పాజ్ వెడల్పు, అలాగే కొత్తగా మరో రెండు అంబర్ పాసులు నిర్మించబడ్డాయి.