Rape In Hospital: ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతి మృతి

ఆసుపత్రిలో వైద్యుల చేతిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో పేగు సమస్యతో చేరింది బాధితురాలు.

Rape In Hospital: ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతి మృతి

Rape In Hospital

Updated On : June 9, 2021 / 3:46 PM IST

Rape In Hospital: ఆసుపత్రిలో వైద్యుల చేతిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో పేగు సమస్యతో చేరింది బాధితురాలు. పరీక్షలు చేసిన వైద్యులు మే 29 ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ జరిగే సమయంలో తనపై వైద్యులు అత్యాచారం చేశారని సదరు యువతి తన సోదరుడికి కాగితంపై రాసి ఇచ్చింది. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మరికాసేపట్లో పోలీసులు వాగ్మూలం రిపోర్ట్ చేసుకునేందుకు వస్తారనగా యువతి మృతి చెందింది. దీంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సమయంలో నలుగురు మహిళ సర్జన్లు, ఇద్దరు మగ వైద్యులతోపాటు ఓ నర్సు ఉన్నారని, అత్యాచారం జరిగిందనే ఆరోపణలో నిజం లేదని ప్రిన్సిపాల్ ఎస్పీ సింగ్ తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పుడే ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని.. అందుకే ఈ విధమైన ఆరోపణలు చేసిందని అన్నారు.