Omicron: జన్యు విశ్లేషణ అవసరం లేదు.. ఒమిక్రాన్‌ని ఇలా గుర్తించొచ్చు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని భావించిన వేళ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది.

Omicran (1)
Omicron: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని భావించిన వేళ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ హెచ్చరికలు చేస్తుంది. ఈ కొత్త SARS-CoV-2 వేరియంట్‌ను ‘ఆందోళనకరమైన వేరియంట్’గా కూడా ప్రకటించింది.
సౌత్ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్.. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా.. జన్యు విశ్లేషణ ద్వారా మాత్రమే కాకుండా RT-PCR పరీక్షల్లోనూ దీనిని గుర్తించవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్తరకం వేరియంట్‌ను RT-PCR పరీక్షల్లో మాత్రమే గుర్తించొచ్చు. అంతర్జాతీయ ప్రయాణికుల్లో మొత్తం మూడు జన్యువులకూ RT-PCR పరీక్షలను నిర్వహించినప్పుడే ఒమిక్రాన్ బయటపడుతుందని చెబుతున్నారు.
Pakistan Gurdwara : గురుద్వారాలో ఫొటోషూట్..వివాదంలో మోడల్ సౌలేహ
‘S’జన్యువు ఉందా? లేదా? అనేది గుర్తించినప్పుడే ఈ వేరియంట్ విషయంలో క్లారిటీ వస్తుంది. మహారాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ.. కోవిడ్‌కు సంబంధించిన RT-PCR నివేదికలో ‘N’,’S’,’E’,‘ORF’ జన్యువులు ఉంటాయి. అయితే, ‘ఒక వ్యక్తిలో ‘S’జన్యువు లేకుండా మిగతావి పాజిటివ్‌గా ఉంటే జన్యు విశ్లేషణ అవసరం లేకుండానే ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లేనని చెబుతున్నారు.
RT-PCR పరీక్షలను నిర్వహించే ల్యాబొరేటరీల్లో ‘S’ జన్యువును పరీక్షించట్లేదు. అయితే, అన్నీ ల్యాబొరేటరీల్లో అదనంగా ‘S’ జన్యువును పరీక్షించేందుకు గైడ్‌లైన్స్ రావల్సి ఉంది. ‘S’ జన్యువును గుర్తించడం వల్ల జీనోమ్ సీక్వెన్సింగ్ కంటే ముందుగానే ఒమిక్రాన్‌ని అంచనా వేయవచ్చు.