Mixed Vaccine: మిక్స్‌డ్ వ్యాక్సిన్‌ డోసులతో ఇమ్యూనిటీ బూస్ట్ – ఆక్స్‌ఫర్డ్ స్టడీ

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన స్టడీలో మిక్స్‌డ్ వ్యాక్సిన్ డోసులతో ఇమ్యూనిటీ బూస్ట్ సాధ్యపడిందని తేలింది. ఇందులో భాగంగా రెండు సార్లు విడివిడిగా ఆస్ట్రాజెనెకాతో పాటు ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్లు ఇచ్చారు.

Mixed Vaccine: మిక్స్‌డ్ వ్యాక్సిన్‌ డోసులతో ఇమ్యూనిటీ బూస్ట్ – ఆక్స్‌ఫర్డ్ స్టడీ

Immune Boost

Updated On : June 29, 2021 / 2:54 PM IST

Mixed Vaccine: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన స్టడీలో మిక్స్‌డ్ వ్యాక్సిన్ డోసులతో ఇమ్యూనిటీ బూస్ట్ సాధ్యపడిందని తేలింది. ఇందులో భాగంగా రెండు సార్లు విడివిడిగా ఆస్ట్రాజెనెకాతో పాటు ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ రెండింటి కలయికలో మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ సెట్ అయింది. ఫలితంగా కరోనావైరస్ స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో యాంటీబాడీలు ప్రొడ్యూస్ అయ్యాయి.

830 మందిపై జరిపిన స్టడీలో నాలుగు వారాల గ్యాప్ తో కాంబినేషన్ తో కూడిన వ్యాక్సిన్ ఇచ్చారు. రెండు డోసులు తీసుకున్న వారిలో అత్యధిక యాంటీబాడీ రెస్పాన్స్ గమనించారు. ఒకే వ్యాక్సిన్ రెండు సార్లు తీసుకున్న వారి కంటే మిక్స్ డ్ డోసులు తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఎక్కువగా కనిపించాయి.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తర్వాత ఫైజర్ వేసుకున్న వారిలో బెస్ట్ టీ సెల్ రెస్పాన్స్ రాగా, ఫైజర్ తర్వాత ఆస్ట్రాజెనెకా వేసుకున్న వారిలో యాంటీబాడీ రెస్పాన్స్ ఎక్కువగా కనిపించింది. నిర్ణీత షెడ్యూల్స్ తో వ్యాక్సిన్లు ఇస్తే చక్కటి ఫలితాలు అందుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ మాథ్యూ స్నాప్ అంటున్నారు.

మీరు ఒకటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా పరవాలేదు. ఇలా ట్రై చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు అదే రుజువైంది’ అని స్పష్టం చేశారు.