వాళ్లు ఆకలి తీర్చటం కోసం పరిగెడుతున్నారు సో..గ్రేట్

  • Published By: nagamani ,Published On : June 1, 2020 / 10:22 AM IST
వాళ్లు ఆకలి తీర్చటం కోసం పరిగెడుతున్నారు సో..గ్రేట్

Updated On : June 1, 2020 / 10:22 AM IST

వాళ్లు కష్టజీవుల ఆకలి తీర్చటానికి పరిగెడుతున్నారు..రైల్వే స్టేషన్ లో రైలు ఆగటం పాపం..ఆహారం పొట్లాలు పట్టుకుని గబగబా పరిగెడుతున్నారు. ఆ ప్యాకెట్లను వాళ్లు అమ్ముకోవటానికి కాదు..లాక్ డౌన్ కష్టాలతో సొంత ఊర్లకు వెళ్లేవారు రైలులో ఆకలితో ఉండకూడదనే పెద్ద మనస్సుతో వారి ఆకలి తీర్చటం కోసం పరిగెడుతున్నారు. తినండి బాబూ తినండి ఎంత ఆకలితో ఉన్నారో ఏమో అంటూ ఆదరంగా అమ్మలాగా అన్నం పెడుతున్నారు.కడుపుడు ఆకలితో ఉన్నవారికి అమతంలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు.  

రెక్కల కష్టాన్ని నమ్ముకుని పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్ కష్టాలతో కడివెడు కష్టాలను వెంటబెట్టుకుని తిరిగి తమ సొంత ఊర్లకు పయనమవుతూ శ్రామిక్ రైళ్లు ఎక్కుతున్నారు.   ఇప్పుడు లాక్‌డౌన్‌ 5.o కొనసాగుతోంది. 

ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వలసకార్మికులను తమ సొంత ఊర్లకు చేర్చడానికి ఆయా రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన నివాసితులు, పాసింజర్లకు ఫుడ్‌ పాకెట్లు అందజేస్తున్న వీడియోను మిజోరం సీఎం  జోరంతంగ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు.

మిజోరం వెళ్లే రైళ్లు బీహార్‌ మీదుగా వెళ్తూ అక్కడ కాసేపు ఆగుతున్నాయి. రైలు ఎక్కడానికి చాలామంది పరుగులు పెడుతుంటే కొంతమంది మాత్రం చేతిలో ఫుడ్‌ప్యాకెట్లు పట్టుకొని రైలు వద్దకు పరుగెడుతున్నారు. ఈ ఆహారం వారికోసం కాదు. రైలులో ప్రయాణించే ప్రయాణికులకోసం. ప్రయాణికులకు సహాయం చేస్తున్న వీడియోను మిజోరం సీఎం జోరంతంగ కంటపడింది. వారిని అభినందిస్తూ..కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు 2,87,600ల వ్యూస్ వచ్చాయి. 6,300 మంది షేర్‌ చేశారు.  

Read:  పాకెట్‌మనీతో వలసకూలీలను విమానంలో పంపించిన బాలిక