కేంద్ర కేబినెట్ సమావేశంలో 7 కీలక నిర్ణయాలు.. వివరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొస్తున్నారు. 20 నిమిషాల్లో రైతులు రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు..

ఢిల్లీలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించి చెప్పారు. దేశంలోని అన్నదాతల కోసం కేంద్ర సర్కారు రూ.13,966 కేటాయింపులు చేసింది. రూ.2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు ఆమోదం తెలిపింది.
వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొస్తున్నారు. 20 నిమిషాల్లో రైతులు రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3,979 కోట్లతో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ కోసం క్రాప్ సైన్స్, 2047 నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకుని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి నిర్ణయా తీసుకున్నారు.
మరిన్ని నిర్ణయాలు
- అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి 2,291 కోట్ల రూపాయలతో ప్రణాళిక
- ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు
- 1,702 కోట్ల రూపాయలతో పశువులు వాటి ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులపై ఫోకస్
- 860 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధి
- హార్టికల్చర్ ద్వారా రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యం
- కృషి విజ్ఞాన్ కేంద్ర అభివృద్ధి కోసం 1,202 కోట్ల రూపాయల కేటాయింపు
- నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం 1,115 కోట్ల రూపాయల కేటాయింపు
- రైతుల జీవన ప్రమాణాలు,ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం నిర్ణయాలు ఉపయోగపడతాయి
- 18,036 కోట్ల రూపాయలతో 309 కిలోమీటర్ల మన్మాడ్- ఇండోర్ కొత్త మార్గ నిర్మాణం కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం
Also Read: వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సర్కారు సిద్ధం