Modi Cabinet Expansion :ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ!

ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Modi Cabinet Expansion :ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ!

Pm Modi (8)

Updated On : July 5, 2021 / 7:43 PM IST

Modi Cabinet Expansion ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మోదీ 2.0 ప్ర‌భుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉన్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. 19-20 మంది కొత్త వారికి మోదీ కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ భావిస్తోంది.

ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లామ్,మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ అప్నాద‌ళ్ చీఫ్ అనుప్రియా ప‌టేల్,అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్,ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం తీర‌థ్ సింగ్ రావ‌త్‌,మహారాష్ట్ర మాజీ సీఎం నాయరణ్ రాణే,బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ,జేడీయూ ఎంపీ సంతోష్ కుమార్ కుశ్వాహ,జేడీయూ నేత ఆర్సీపీ సింగ్, ఢిల్లీ మాజీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,హుగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ,లడఖ్ ఎంపీ జామ్యాంగ్ తెషేరింగ్ నంగ్యాల్, మధ్య‌ప్ర‌దేశ్‌లో తిరిగి బీజేపీ ప్ర‌భుత్వం కొలువు దీర‌డంలో కీల‌క భూమిక వ‌హించిన యువ‌నేత జ్యోతిరాదిత్య సింధియా సహా 19-20 మంది కొత్త వారికి మోదీ కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

కాగా,కేబినెట్ విస్త‌ర‌ణ‌ విషయమై శనివారం,ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో ప్రధాని మోదీ రహస్య చ‌ర్చ‌లు జ‌రిపినట్లు సమాచారం. ప్రధాని మోదీ నివాసంలో ఆదివారం మీటింగ్ సుమారు ఆరు గంటల పాటు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం మీటింగ్ కూడా ఐదారు గంటల పాటు జరిగినట్లు సమాచారం.

మరోవైపు,కేబినెట్ విస్తరణ పై ముహుర్తాల ప్రభావం కూడా ఉండే అవకాశముంది. జులై 20 నుంచి నవంబర్ 14 వరకు చాతుర్మాసం కొనసాగనుంది. పవిత్రమైన చాతుర్మాస నాలుగు నెలల్లోఉత్తరాది వాసులు శుభకార్యాలకు దూరంగా ఉంటుంటారు. కాబట్టి కేంద్ర కేబినెట్ విస్తరణ చాతుర్మాసం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేస్తారని, లేదంటే చాతుర్మాసం పూర్తయిన తర్వాతనే ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.