Modi Cabinet Expansion
Cabinet Reshuffle: అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత..మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఈ విస్తరణకు గట్టి కసరత్తే చేసినట్లు కనిపిస్తోంది. యువతరానికి పెద్ద అవకాశం ఇవ్వాలని భావించి..అందుకనుగుణంగా…విస్తరణ చేశారని సమాచారం. ఇక ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల వివరాల విషయానికి వస్తే…
నారాయణ్ రాణే (మహారాష్ట్ర) : మహారాష్ట్ర మాజీ సీఎం, ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది.
సర్వానంద సోనోవాల్ (అసోం) : అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014-16 మధ్య కేంద్రంలో క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు.
వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్) : ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
జ్యోతిరాధిత్య సింధియా (మధ్యప్రదేశ్) : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఐదుసార్లు ఎంపీ,
గతంలో మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
Read More : New Ministers Take Oath : ప్రమాణస్వీకారం చేసిన కొత్త కేంద్ర మంత్రులు
ఆర్.సి.పి.సింగ్ (బీహార్) : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, 25 ఏళ్ల సర్వీసు. రెండుసార్లు రాజ్యసభకు పనిచేసిన అనుభవం ఉంది.
అశ్వినీ వైష్ణవ్ (ఒడిశా) : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 15 ఏళ్ల సర్వీసు అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
పశుపతి నాథ్ పరాస్ (బీహార్) : ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎమ్మెల్సీ. బీహార్ లో సీనియర్ నేత, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.
కిరణ్ రిజుజు (అరుణాచల్ ప్రదేశ్) : కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీలో యంగ్ అండ్ యాక్టివ్ నేత.
Read More :CM Jagan Letter : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
రాజ్ కుమార్ సింగ్ (బీహార్) : అర్రా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇండియాకు హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
హర్ దీప్ పూరీ (పంజాబ్) : కేంద్ర పౌర విమానయాన శాఖగా మంత్రిగా ఉన్నారు. 1974 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు.
మనుష్క్ మాండవియా (గుజరాత్) : రాజ్యసభ సభ్యుడు. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
భూపేందర్ యాదవ్ (రాజస్థాన్) : రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.
Read More : Danam Nagender Jail : మాజీ మంత్రి దానం నాగేందర్ కు జైలు శిక్ష
పురుషోత్తం రూపాల (గుజరాత్) : కేంద్ర పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
కిషన్ రెడ్డి (తెలంగాణ) : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ బీజేపీ నేతల్లో కీలక నాయకుడు. ప్రధాన మంత్రి మోదీకి సన్నిహితులు. స్టూడెంట్ లీడర్ నుంచి కేబినెట్ మంత్రిగా ప్రస్థానం. 1980 నుంచి 1994 వరకు పార్టీ కార్యాలయంలోనే నివాసం ఉండేవారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2002లో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు, 2004-19 మధ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. హోం శాఖ సహాయ మంత్రిగా కశ్మీర్ వ్యవహారాల పర్యవేక్షించారు. బీజేపీలో వివాదరహితుడిగా పేరు పొందారు.
Read More :Windows 10 Free Upgrade : విండోస్ 7, 8.1 నుంచి విండోస్ 10కు ఫ్రీ అప్‌గ్రేడ్ కావొచ్చు.. ఎలానంటే?
అనురాగ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్) : కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నారు. అనురాగ్ తండ్రి మాజీ సీఎం, హిమాచల్ ప్రదేశ్ బీజేపీలో కీలక పాత్ర పోషించారు.
పంకజ్ చౌదరి (ఉత్తర్ ప్రదేశ్) : మహారాజ్ గంజ్ లోక్ సభ స్థానం నుంచి ఆరుసార్లు ఎన్నికయ్యారు. పలు కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.
అనుప్రియ పటేల్ (ఉత్తర్ ప్రదేశ్) : తండ్రి చనిపోయినా..అప్నాదల్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్న లీడర్ గా గుర్తింపు పొందారు. 2014 నుంచి బీజేపీతో అప్నాదల్ జతకట్టడం కలిసొచ్చే అంశం.
సత్యపాల్ సింగ్ భఘేల్ (ఉత్తర్ ప్రదేశ్) : ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
Read More : Ministers Resignation :12మంది మంత్రుల రాజీనామాలని ఆమోదించిన రాష్ట్రపతి
రాజీవ్ చంద్రశేఖర్ (గుజరాత్) : కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యులు.
శోభా కరంద్లాజే (కర్నాటక) : ఉడిపి చిక్ మంగళూరు లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కర్నాటక ప్రభుత్వం కేబినెట్ గా మంత్రిగా పనిచేశారు.
భానుప్రతాప్ సింగ్ వర్మ (ఉత్తర్ ప్రదేశ్) : జలౌన్ లోక్ సభ స్థానం నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. పలు కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.
మీనాక్షి లేఖ (ఢిల్లీ) : ఢిల్లీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. న్యాయవాద వృత్తిలో ఉన్నారు.
అన్నపూర్ణ దేవి (జార్ఖండ్) : కొదర్మ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికయ్యారు. అంతకుముందు ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More : ‘Honor Killing’ : యువతిని రైఫిల్స్ తో కాల్చి చంపిన 10మంది బంధువులు
ఇంకా…దర్శన్ విక్రమ్ జర్ధోష్ (గుజరాత్), ఎ.నారాయణ స్వామి (కర్నాటక), కౌశల్ కిశోర్ (ఉత్తర్ ప్రదేశ్), అజయ్ భట్ (ఉత్తరాఖండ్), బి.ఎల్ వర్మ (ఉత్తర్ ప్రదేశ్), అజయ్ కుమార్ మిశ్రా (ఉత్తర్ ప్రదేశ్), దేవ్ సింహా చౌహాన్ (గుజరాత్), భగవంత్ కుభా (కర్నాటక). ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.
Read More : Modi Cabinet: మోదీ కేబినెట్..కొత్త మంత్రుల జాబితా