Danam Nagender Jail : మాజీ మంత్రి దానం నాగేందర్ కు జైలు శిక్ష

ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

Danam Nagender Jail : మాజీ మంత్రి దానం నాగేందర్ కు జైలు శిక్ష

Former Minister Danam Nagender Was Sentenced To Six Months In Jail

Updated On : July 7, 2021 / 6:08 PM IST

Danam Nagender jail : మాజీ మంత్రి, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జైలు శిక్ష పడింది. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

2013లో బంజారా హిల్స్ లో నమోదైన కేసులో దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారన్న కేసులో అభియోగాలు రుజువయ్యాయి. అప్పీల్ కు వెళ్లేందుకు వీలుగా శిక్షను నెల రోజులపాటు నిలిపివేసింది. దానం నాగేందర్ పై కోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.