కేంద్ర ఉద్యోగులు 20 ఈఎల్స్‌ని వాడుకోవాల్సిందే!
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…మీ ఎర్న్‌డ్ లీవ్స్ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇక వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మొత్తం 30 ఎర్న్డ్ లీవులుంటాయి. (ఈఎల్స్ – ఆర్జిత సెలవులు). ఇందులో 10 లీవులు…నెక్ట్స్ ఏడాదికి సెలవుల్లో కలుస్తాయని ఉత్తర్వులో పేర్కొననుంది. అంటే…మిగతా ఉన్న 20 సెలవులు ఆ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. వాడుకోకపోతే అంతే..వృథానే. కచ్చితంగా తమ సిబ్బందిని పది రోజుల సెలవుపై పంపుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ. 63.232 కోట్లు కేటాయించింది.