కాంగ్రెస్‌పై మోడీ పంచ్‌లు..సభలో నవ్వులే నవ్వులు

  • Published By: madhu ,Published On : February 6, 2020 / 10:24 AM IST
కాంగ్రెస్‌పై మోడీ పంచ్‌లు..సభలో నవ్వులే నవ్వులు

Updated On : February 6, 2020 / 10:24 AM IST

లోక్ సభలో ప్రధాన మంత్రి మోడీ పంచ్ డైలాగ్‌లు విసిరారు. ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ..నవ్వుతూ ఎంజాయ్ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా 2020, ఫిబ్రవరి 06వ తేదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని పరోక్షంగా వ్యంగ్యాస్రాలు విసిరారు. ఇక్కడ రాహుల్ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. 

మరో ఆరు నెలల్లో ప్రధాని మోడీని కర్రలతో కొడుతారని నేతలు అంటుండగా..తాను వినడం జరిగిందని సభలో తెలిపారు. అయితే..ఇక నుంచి తాను సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలని అనుకుంటున్నట్లు, దీనివల్ల వెనుక నుంచి వీపులో కొట్టినా సరే..సూర్య నమస్కారాలు చేయడం వల్ల వీపు మరింతగా ధృడమౌతుందని..ఎన్ని కట్టెల దెబ్బలనైనా అది భరిస్తుందని ఎద్దేవా చేశారు. 

ఇలాంటి నిందలను తాను రెండు దశబ్దాలుగా తనపై వేస్తున్నారని, వీటిని పట్టించుకోనని స్పష్టం చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ లేచి ఏదో కామెంట్స్ చేశారు. దీనికి అధికారపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మోడీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సభలో గత 40 నిమిషాలుగా మాట్లాడుతున్నట్లు, కొందరికి ఏ మాత్రం అర్థం కాదని సెటైర్ వేశారు. ఇప్పుడే కరెంటు వెలిగిందని..కొందరు ట్యూబ్ లైట్లు..అంతేనంటూ రాహుల్‌పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

రాహుల్ ఏమన్నారంటే..
ఢిల్లీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రచారంలో భాగంగా రాహుల్..బీజేపీపై పలు విమర్శలు చేశారు. మోడీ ఇంట్లోంచి బయటకు రావడం లేదు..ఉద్యోగాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే..యువకులు ఆయనను కర్రలతో బాదుతారంటూ రాహుల్ కామెంట్స్ చేశారు.