అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వర్షాలు కురిసే ఛాన్స్
గత ఐదేళ్లలో నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించిన తేదీలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.

Monsoon
అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి ఇవాళ సాయంత్రం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి కూడా ప్రవేశించే చాన్స్ ఉన్నట్లు చెప్పింది.
దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. అండమాన్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక క్రమంగా ముందుకు వెళ్లి కేరళను తాకుతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకవచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: సీబీఎస్‌ఈ 12వ తరగతి రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది మూడురోజులు ముందే రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. కాగా, తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
గత ఐదేళ్లలో నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించిన తేదీలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. 2020లో జూన్-1న, 2021లో జూన్-3న, 2022లో మే-29న, 2023లో జూన్-8న, 2024లో మే-30న ప్రవేశించాయి.
నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. రుతుపవనాలు ప్రవేశించాక జులై 8 నాటికి భారత్ వ్యాప్తంగా విస్తరిస్తాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 లేదా ఆ తర్వాతే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కొన్ని సార్లు మాత్రం ముందుగానే ప్రవేశిస్తుంటాయి. 2009లో నైరుతి రుతుపవనాలు మే 23నే ప్రవేశించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. సెప్టెంబరు 17న రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమవుతుంది.