హైఅలర్ట్: దేశంలో 3చోట్ల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని హెచ్చరిక

ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 12:40 PM IST
హైఅలర్ట్: దేశంలో 3చోట్ల ఆత్మాహుతి దాడులు జరగొచ్చని హెచ్చరిక

ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..

ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా.. అంటే.. నిఘా వర్గాలు అవువనే అంటున్నాయి. దేశంలో మరికొన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా వర్గాలకు సమాచారం అందింది. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో రానున్న రోజుల్లో మరికొన్ని అటాక్స్‌ జరగొచ్చని నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దేశంలో 3 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని వారికి ఇన్ఫర్మేషన్ అందింది.

    
కశ్మీర్‌తో పాటు మరో రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జేషే మహమ్మద్ ప్లాన్ వేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చాయి. ఆత్మాహుతి దాడులు జరిపేందుకు 2018 డిసెంబర్‌లోనే 21మంది తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, వారంతా వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని ఐబీ తెలిపింది. సూసైడ్ బాంబర్ అటాక్స్ జరిపేందుకు 1990 నుంచి 1995 వరకు రిజిస్టర్ చేసిన 16 పాత కార్లను తీవ్రవాదులు సేకరించినట్లు నిఘా సంస్థలకు తెలిసింది. దాడులు జరగొచ్చు అన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జమ్మూకాశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించింది. రంగంలోకి దిగిన భద్రతా దళాలు జమ్మూకాశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.

 

నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగుతోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, బీఎస్ఎఫ్ డీజీ, సీఆర్పీఎఫ్ డీజీ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో అంతర్గత భద్రత, కశ్మీర్‌లో తాజా పరిణామాలు, బలగాల తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి తర్వాత పుల్వామాలో గాలింపు చర్యలను ముమ్మంర చేశారు. టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతోంది. ఆర్మీ, 55వ రాష్ట్రీయ రైఫిల్స్, కశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు కూంబింగ్ చేపట్టారు. ఫిబ్రవరి 18వ తేదీన పుల్వామా ఎన్‌కౌంటర్‌లో జవాన్లపై ఆత్మాహుతి దాడి సూత్రధారి సహా ముగ్గురు టెర్రిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.