టేబుల్ టాప్ రన్‌వే ఏంటి? ఇండియాలో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయంటే?

  • Published By: sreehari ,Published On : August 8, 2020 / 03:36 PM IST
టేబుల్ టాప్ రన్‌వే ఏంటి? ఇండియాలో ఏయే ప్రాంతాల్లో ఉన్నాయంటే?

Updated On : August 8, 2020 / 3:50 PM IST

కొలికోడ్ ఘోర విమాన ప్రమాదం లాంటి ఘటన సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు ఎయిర్ పోర్టులో జరిగింది. 2010లో మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి ఇప్పుడు జరిగిన కొలికోడ్ ప్రమాదం ఒకే రకమైన రన్ వేలపై జరిగింది. వీటిని టేబుల్ టాప్ రన్ వేలని పిలుస్తారు.. ఇంతకీ, టేబుల్ టాప్ రన్ వేలు అంటే ఏంటి? దేశంలో ఎక్కడున్నాయనేది ఓసారి లుక్కేద్దాం.

టేబుల్ టాప్ ‌రన్ వే.. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండేచోట ఈ తరహా రన్ వేలు ఏర్పాటు చేస్తారు. రన్ వేలకు ముందు, వెనుకా కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే రన్‌వేలతో పోలిస్తే పొడవు చాలా చిన్నదిగా ఉంటుంది. పైలట్లకు ఇక్కడ విమానాలను ల్యాండ్ చేయడం కష్టమైనపనే.. కొంచెం తప్పు జరిగిన విమానానికి ప్రమాదం జరగడం ఖాయం..



అందుకే విమానాశ్రయం రన్ వేకు రెండు చివరలలో కొంత స్థలం ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలికోడ్ లో అలా అదనంగా స్థలం లేదని చెబుతున్నారు. విమాన ప్రమాదం సమయంలో వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇరుకైన రహదారుల కారణంగా సహాయక చర్యల ఆలస్యానికి సైతం కారణమవుతాయి.

రన్ వేలు ఎక్కడెక్కడ ఉన్నాయి? :
టేబుల్ టాప్ రన్ వేలు కలిగిన విమానాశ్రయాలు ఇండియాలో మూడు చోట్ల ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు, కేరళలోని కొలికోడ్, మిజోరంలోని లెంగ్వ్యూలలో ఉన్నాయి. అన్ని రకాల విమానాలు ఈ టేబుల్ టాప్ రన్వేలపై దిగడానికి అనుకూలం కాదు. SFC సాంకేతికత ఉన్న విమానాలు మాత్రమే దిగగలవు. సాధారణ రన్వేలపై దించిన విధంగానే వీటిపైనా విమానాలను దించేందుకు ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదాలు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొలికోడ్ విమానాశ్రయం:
కొలికోడ్ విమానాశ్రయాన్ని కరిపూర్ విమానాశ్రయంగా పేరుంది. కొలికోడ్ మలప్పురం నగరాల ప్రజలకు సేవలందించే అంతర్జాతీయ విమానాశ్రయంగా చెబుతారు. మలప్పురానికి 25 కి.మీలు, కొలికోడ్కు 28 కి.మీల దూరంలో ఉంది. కొండపైన భూభాగంలో నిర్మించిన ఈ రన్‌వేపై విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు పెను సవాలుగా మారింది.



లెంగ్ ప్యూ విమానాశ్రయం:
మిజోరంలోని లెంగ్ ప్యూ ఎయిర్ పోర్టులో 2500 మీటర్ల రన్వే ప్రత్యేకమైనది. దీని కింద కొండలు ఉన్నాయి. మూడు టేబుల్ రన్వే విమానాశ్రయాల్లో ఇదీ ఒకటి. సముద్ర మట్టానికి 504 మీటర్ల ఎత్తులో ఈ ఎయిర్ పోర్టు ఉంది.. ఐజాల్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.



మంగళూరు విమానాశ్రయం:
మంగళూరు విమానాశ్రయం కూడా కొండపైనే ఉంటుంది. రెండు టేబుల్టాప్ రన్వేలు ఉంటాయి. దేశీయ విమానాలు పరిమితంగానే నడుస్తాయి. ప్రధానంగా ముంబయి, బెంగళూరుకే ఇక్కడి నుంచి విమానాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. రెండు రన్వేలలో ఒకటి 1615 మీటర్లు కాగా.. రెండోది 2450 మీటర్లుగా ఉంది.