Uttarakhand: నమామీ గంగా ప్రాజెక్ట్ సైట్‭లో ట్రాన్స్‭ఫార్మర్ పేలి 15 మంది మృతి

అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము

Uttarakhand: నమామీ గంగా ప్రాజెక్ట్ సైట్‭లో ట్రాన్స్‭ఫార్మర్ పేలి 15 మంది మృతి

Updated On : July 19, 2023 / 3:08 PM IST

Namami Gange Project: ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న రెండు డజన్ల మంది ఉద్యోగులు అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది చనిపోయినట్లు ఛమోలి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పర్మేంద్ర దోవల్ తెలిపారు. గాయాలపాలైన వారికి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Parliament Monsoon Sessions : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 28 బిల్లులతోపాటు యూసీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

మృతుల్లో పిపాల్‌కోటికి ఇన్‌చార్జ్‌ కూడా ఉన్నారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అశోక్ కుమార్ తెలిపారు. ఇక ఈ ఘటనపై ఎస్పీ పర్మేంద్ర దోవల్ మాట్లాడుతూ ‘‘అలకనంద నది తీరంలో జరిగిన ఈ పేలుడు కారణంగా 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా రిషికేష్ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తరలించాము. ఐదుగురిని గోపేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించాం’’ అని తెలిపారు.


కాగా, ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు రెస్క్యూ బృందం, రాష్ట్ర విపత్తు స్పందన బృందం వెంటనే సేవల్లోకి దిగాయని పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఉత్తమమైన వైద్యం కోసం హెలికాప్టర్ లు ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘చమోలిలో జరిగిన అత్యంత హృదయ విదారకమైన ప్రమాదం జరిగిన ప్రదేశానికి తనిఖీ చేయడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో మా ప్రభుత్వం ప్రమాద బాధిత ప్రజలకు అండగా నిలుస్తుంది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.