అఖండ భారత్ ను చూపే భారత్ మాత మందిరం

  • Published By: chvmurthy ,Published On : December 29, 2019 / 12:17 PM IST
అఖండ భారత్ ను చూపే భారత్ మాత మందిరం

Updated On : December 29, 2019 / 12:17 PM IST

దేశంలో ఎలాంటి పరిస్ధితులు తలెత్తినా వారణాశిలోని భారత్ మాతా మందిర్ మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ మందిరం పవిత్ర కాశీ విశ్వనాధ్ మందిర్ కు సమీపంలోని ఆర్యన్ లోలార్కా కుండ్ సంతానోత్పత్తి చెరువు వద్ద ఉన్నప్పటికీ సందర్శకుల తాకిడి తక్కువగానే ఉంటుంది. 

పవిత్ర పుణ్యక్షేత్రం కాశిలోని  ఈభారత మాత ఆలయంలో ఏదేవుడు దేవతా ఉండరు. కానీ ఇక్కడ ఆలయానికి వెళ్తే  దేశభక్తిని నింపే అద్భుతం సాక్షాత్కరిస్తుంది. భారతమాత మందిరాన్ని స్వాతంత్ర్యానికి పూర్వమే నిర్మించారు. మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ క్యాంపస్ లో దీన్ని 1936లో విశ్వవిద్యాలయ వ్యవస్ధాపకుడు, స్వాతంత్ర్యసమర యోధుడు బాబు శివప్రసాద్ గుప్తా నిర్మించగా మహాత్మాగాంధీ ప్రారంభించారు. హాల్ ప్రధాన ద్వారంపై వందే మాతరం అని చెక్కిన శిల్పాకృతి మనల్ని ఆహ్వానిస్తుంది. 

హాల్ యొక్క మొదటి అంతస్తులో పాలరాయితో నిర్మించిన అఖండ భారత ఉపఖండం  చిత్రపటం (మ్యాప్) సందర్శకులను కట్టి పడేస్తుంది. భారతదేశం చిత్రపటం అంటే మనకు ఉత్తరాన హిమాలయాలు, ఒక వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్ కనిపిస్తాయి. ఆ మ్యాప్ లో పర్వతాలు, నదులు మరియు సముద్రాలు చక్కగా వివరించబడ్డాయి… కాని భారతదేశానికి ఉండే సరిహద్దు రేఖలు ఈమ్యాప్ లో లేవు.   

అంటే అఖండ్ భారత్ ను మనం ఇక్కడ చూడవచ్చు. ఆప్గనిస్తాన్‌ను గాంధార దేశంగా భావిస్తారు. ఇలా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన భారత్‌ను అఖండ భారత్ అంటారు. ఇది ప్రాచీన భారతం అసలు స్వరూపం. రాజస్ధాన్ లో దొరికే అరుదైన మక్రానా మార్బుల్ తో ఈఅఖండ భారత్ చిత్ర పటాన్ని రూపోందించారు. భరతమాత ఆలయం చూడటానికి ఎటువంటి నింబంధనలు లేనందున ఎవ్వరైనా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్యదినోత్సవం రోజున మ్యాప్ ను నీటిలో ఉంచుతారు.