MP Cop : బురద పడిందని ప్యాంటును తుడిపించిన మహిళా పోలీసు

రేవాలో ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్ రివర్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ పోలీసు అక్కడనే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆమె ప్యాంటుపై బురద పడిపోయింది. కోపంతో ఊగిపోయిన..

MP Cop : బురద పడిందని ప్యాంటును తుడిపించిన మహిళా పోలీసు

Mp Police

Updated On : January 12, 2022 / 4:22 PM IST

MP Cop Forces Man : అధికారం ఉంది కదా అని కొంతమంది విర్రవీగుతుంటారు. మరికొంతమంది మాత్రం ఎలాంటి బేషజాలకు పోకుండా…చాలా సాదాసీదాగా ఉంటారు. అధికారం..కొద్దిగా హోదా ఉందని…ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాగే వ్యవహరించారు ఓ మహిళా పోలీసు. తన ప్యాంటు మీద పడిన బురదను ఓ వ్యక్తి చేత తుడిపించారు. అంతేగాదు..వెళ్లేటప్పుడు చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సీరియస్ అయ్యారు. ఫిర్యాదు అందితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు.

Read More : Elephants rescued: కాలువలో చిక్కుకున్న ఏనుగుల గుంపు

రేవాలో ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్ రివర్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ పోలీసు అక్కడనే ఉన్నారు. ప్రమాదవశాత్తు ఆమె ప్యాంటుపై బురద పడిపోయింది. కోపంతో ఊగిపోయిన ఆమె..తన ప్యాంట్ ను శుభ్రం చేయాలని డిమాండ్ చేసింది. దీంతో అతను ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. ఇంత చేసినా..ఆమె శాంతించలేదు. వెళ్లే సమయంలో చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది. Anurag Dwary అనే వ్యక్తి..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వీడియో వైరల్ కావడం..ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. కలెక్టర్ కార్యాలయంలో పని చేసే హోం గార్డు శశికళగా గుర్తించారు. ఫిర్యాదు చేస్తే..శశికళపై చర్యలు తీసుకుంటామని రేవా ఎస్పీ శివకుమార్ తెలిపారు.