హాస్పిటల్ ఫీజు రూ.5 కట్టలేక భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయినంటోన్న మహిళ

హాస్పిటల్ ఫీజు రూ.5 కట్టలేక భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయినంటోన్న మహిళ

Updated On : July 25, 2020 / 4:28 PM IST

హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి ఐదు రూపాయలు లేక తన భర్త ప్రాణాలు కోల్పోయడాని ఓ మహిళ ఆవేదన వెల్లదీస్తుంది. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ ను అడ్మిట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. సాధాణంగా రూ.5 తక్కువే అయినప్పటికీ అవి కూడా లేకపోవడంతో హాస్పిటల్ లో చేర్చుకునేందుకు నిరాకరించారు.

అశోక్ నగర్ జిల్లాలో ఉండే ఆర్తి రజాక్.. టీబీతో బాధపడుతున్న భర్తను తీసుకుని హాస్పిటల్ కు వచ్చింది. బుధవారం సాయంత్రం మూడేళ్ల కొడుకుతో అక్కడికి వచ్చింది. కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి డబ్బులు కావాలని అడిగాడు. ఆమె దగ్గర లేవని చెప్పినా కనికరించలేదు. గురువారం ఉదయం వరకూ చెట్టు కిందనే వెయిట్ చేసింది.

అంతసేపు వెయిట్ చేసినప్పటికీ అడ్మిషన్ చీటి దొరకలేదు. దాంతో ఆమె భర్త అశోక్ ధాకడ్ కాసేపటికే మరణించాడు. జిల్లా కలెక్టర్ కుమార్ పురుషోత్తం ఘటనపై స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలు నిజం కాదని కొట్టిపారేశారు. అసలు అక్కడ చిట్టీల పద్ధతికే తొలగించినట్లు చెప్పారు.

అక్కడ ఉన్న ఫుటేజి ఆధారంగా మాట్లాడిన కలెక్టర్.. మహిళ గురువారం తెల్లవారుజామున మాత్రమే హాస్పిటల్ కు వచ్చింది. అయినప్పటికీ ఆమె బిల్డింగ్ లోపలికి కూడా ఎంటర్ కాలేదని చెప్పారు.