కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,

టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, వెంటనే ఆ మొత్తం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ పై ధోనీ కోర్టుని ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థ తనకు రూ. 40 కోట్లు ఇవ్వాలని చెప్పాడు. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశానని, అందుకు తనకు రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. ఆ బకాయీలు ఇంకా చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూపు. ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై అనేక కేసులు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ ప్లాట్లు డెలివరీ చేయలేదని 46వేల మంది పిటిషన్లు వేశారు.
Read Also : రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొదలు
ఆరేళ్ల పాటు ధోనీ ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. 2009లో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమ్రపాలి సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. 2016లో ఆ సంస్థతో ధోని ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ఆమ్రపాలి మోసాలు వెలుగులోకి వచ్చాక.. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోనిపై సోషల్ మీడియాలో యాంటీ క్యాంపెయిన్ నడిచింది. ఇలాంటి సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ధోనీ వల్ల అమాయకులు మోసపోతారని విమర్శలు వచ్చాయి. దీన్ని గుర్తించిన ధోని.. వెంటనే ఆ సంస్థతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు.
ధోనీకి రావాల్సిన అమౌంట్ రూ.22.53 కోట్లు. రూ.16.42 కోట్లు వడ్డీ(18శాతం వడ్డీ)తో కలిపి ఆ బకాయిలు రూ.38.95 కి చేరాయని ధోని తెలిపాడు. ఆమ్రపాలి సంస్థతో చేసుకున్న ఒప్పందం కాపీలను ధోని కోర్టుకి సమర్పించాడు. కస్టమర్లను మోసం చేసిన కేసులో ఫిబ్రవరి 28, 2018న ఆమ్రపాలి గ్రూప్ సీఎండీ అనిల్ శర్మ.. ఇద్దరు డైరెక్టర్లు శివ్ ప్రియ, అజయ్ కుమార్ లను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also : కాంగ్రెస్ లో అంతేగా : టికెట్ ఇవ్వలేదని.. పార్టీ ఆఫీస్ సామాను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే