ఆటిజమ్ బాధితులు చేసిన అందమైన దీపాలు 

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 10:57 AM IST
ఆటిజమ్ బాధితులు చేసిన అందమైన దీపాలు 

Updated On : October 24, 2019 / 10:57 AM IST

ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థ ఆటిజం బాధితులలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను వెలికి తీస్తోంది. వారితో మట్టి దీపాలను తయారు చేయిస్తూ వారిలో ఉండే ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుతోంది. ఈ దీపావళికి ఆటిజం బాధితులతో రంగు రంగుల దీపాలను..కలర్ ఫుల్ పేపర్లతో దీపాల ఆర్ట్ లను..పూసలతో ఆకట్టుకునే దండలతో పాటు పలు కళారూపాలను తయారు చేయిస్తోంది. ఇవే కాకుండా పలు కళాకృతులను తయారు చేయటంలో వారికి శిక్షణనిస్తోంది. అలా తయారు చేసినవాటిని ఎగ్జిబిషన్లలో విక్రయించి వారికి ఉపాధిని కల్పిస్తోంది ఆవన్ పాలక సంఘ  అనే సేవా సంస్థ. 

ఈ విషయంపై ఆవన్ పాలక సంఘ్ సంస్థ కన్వీనర్ వందనీ కార్వే తెలిపారు. ఆటిజమ్ ఉన్నవారితో ఆర్టికల్స్ తయారు చేయించటానికి 2 నుంచి 3 నెలలు పట్టిందనీ కానీ తమ సంస్థ వాలంటీర్లు చెప్పినవాటిని వారు శ్రద్ధగా విని నేర్చుకోవటానికి యత్నిస్తుంటారనీ తెలిపారు. దీపావళి సందర్భంగా ఆటిజం బాధితులతో ఆర్టికల్స్ తయారు చేయించాలని తాము అనుకుని అవి నేర్పించామని తెలిపారు. గత 25 సంవత్సారాల నుండి తాము ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థను నడిపిస్తున్నామనీ వందనా కార్వే తెలిపారు. వారు తయారు చేసిన కళాకృతులను ఢిల్లీలో ప్రదర్శించామనీ వాటికి మంచి స్పందన వచ్చిందనీ వందనా తెలిపారు.