కాస్ట్లీ కారు అమ్మేసి కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ సిలిండర్లు కొన్న యువకుడు

కరోనా కష్టకాలంలో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు ఎంతోమంది. కరోనాతో పోరాడుతున్న డాక్టర్లకు మాస్కులు, పీపీఈ కిట్స్ దానం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల కోసం చాలామంది విరాళాలు ఇస్తుంటారు. కానీ..ముంబైలోని మలాడ్‌కు చెందిన షానవాజ్ షేక్ అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త మాత్రం అలాకాదు.
ఆరు నెలల గర్భవతి అయిన తన బిజినెస్ పార్టనర్ చెల్లికి కరోనా సోకింది. ఆమె భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దాదాపు ఐదు ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. ఎవ్వరూ ఆమెను చేర్చుకోలేదు. కొన్ని హాస్పిటల్స్ అయితే కరోనా పేషెంట్లకు బెడ్స్ ఖాళీలేవని చెప్పారు. రికొంతమంది ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేవన్నారు.
అలా..ఆరవ హాస్పిటల్ కు తీసుకెళుతుండగా ఆమె దారిలోనే ఆటోలోనే చనిపోయింది. కానీ..ఆమెకు టైముకి ఆక్సిజన్ అందించి ఉంటే బతికేదని కొందరు డాక్టర్లు అన్నారు. ఈ విషయం షానవాజ్ కు తెలిసింది. దీంతో..అతని మనస్సు విలవిల్లాడిపోయింది. ఏదైనా చేయాలనుకున్నాడు. తన కారును అమ్మి 250 ఆక్సిజన్ సిలిండర్లు కొన్నాడు. వాటిని కరోనా సోకిన పేద ప్రజలకు ఇచ్చాడు. ఎవరికైనా అవసరం పడితే తనకు ఫోన్ చేసే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటుచేస్తానని తెలిపారు.
‘నేను ఓ కారును అమ్మడం వల్ల నాకు పెద్దగా పోయిందేమీ లేదు. కానీ, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల కొన్ని ప్రాణాలు నిలబడుతున్నాయి. వాళ్ల ఆశీర్వచనాలు నాకు దక్కుతున్నాయి.’ అని షానవాజ్ అన్నాడు. అంతేకాదు..తన ఫోర్డ్ ఎండీవర్ కారును ఓ ప్రైవేట్ అంబులెన్స్‌గా ఎందరో పేదలను ఆస్పత్రులకు ఫ్రీగా తీసుకువెళుతున్నాడు.
Read: పాకిస్తాన్ లో రూ. 10 కోట్లతో శ్రీకృష్ణుడి దేవాలయం..భూమి పూజ కూడా జరిగింది