బట్టతల దాచిపెట్టి పెళ్లిచేసుకున్నాడు : భర్తపై కేసు పెట్టిన కొత్త పెళ్లికూతురు

  • Published By: nagamani ,Published On : November 2, 2020 / 01:23 PM IST
బట్టతల దాచిపెట్టి పెళ్లిచేసుకున్నాడు : భర్తపై కేసు పెట్టిన కొత్త పెళ్లికూతురు

Updated On : November 2, 2020 / 1:46 PM IST

Mumbai : కాబోయే భర్త నల్లని ఒత్తైన ఉంగరాల జుట్టుతో..ఆరడుగుల అందగాడై ఉండాలని ప్రతీ అమ్మాయి కలలు కంటుంది. అన్ని ఆశలు పెట్టుకున్న ఓ అమ్మాయికి పాపం ఉంగరాలు జుట్టు కాదు కదా..కనీసం నెత్తిమీద గుప్పెడు జుట్టు కూడా లేని వ్యక్తి భర్త అయ్యాడు. పెళ్లిచూపులకు వచ్చినప్పుడు నిగనిగలాడే చక్కటి జుట్టుతో తో వచ్చిన పెళ్లికొడుకుని చూసి మురిసిపోయింది. నాకు నచ్చాడని చెప్పింది. దీంతో భాజభజంత్రీలు మోగాయి. అంగరంగ వైభోగంగా పెళ్లి కూడా జరిగిపోయింది. అత్తారింటికి వెళ్లింది. కానీ అక్కడే బైటపడింది భర్త అసలు రంగు. భర్త ‘బట్టతల’ చూసిన ఆ కొత్త పెళ్లికూతురు షాక్ అయ్యింది.


జుట్టు ఉందని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిసి లబోదిబోమంది.పెళ్లి చూపులప్పుడు నిండైన జుట్టుతో అందంగా కనిపించిన భర్త.. పెళ్లయ్యాక భర్త తలను చూసి తట్టుకోలేకపోయింది. తనను మోసం చేశారంటూ భర్త, అతడి కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు పెట్టింది.


తన భర్తకు బట్టతల ఉందన్న విషయాన్ని దాచిపెట్టి..తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ మీరా రోడ్డుకు చెందిన 29 ఏళ్ల భర్త, అతడి కుటుంబ సభ్యులపై నయానగర్ పోలీస్ స్టేషన్‌లో 27 ఏళ్ల భార్య చీటింగ్ కేసు పెట్టింది. చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసే అతనికి గత సెప్టెంబరులో వివాహమైంది. పెళ్లయిన తర్వాత కొత్త పెళ్లి కూతరుకు తన భర్తకు బట్టతల ఉందని తెలిసింది. తన భర్తకు బట్టతల ఉందని, విగ్ పెట్టుకుంటాడని తెలిసింది.


అతడికి బట్టతల ఉందన్న విషయం పెళ్లికి ముందే తనకు ఎందుకు చెప్పలేదని భర్తను..అత్తమామలను నిలదీసింది. దానికి వాళ్లు ఏమీ చెప్పలేకపోయారు. దీంతోఆమె మంగళవారం (అక్టోబర్ 27,2020) ఏకంగా నయానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది.


బట్టతలతో మోసం చేశాడని..నా నమ్మకాన్ని మోసం చేయటం కూడా నేరమేని తెలిపింది. దీంతో పోలీసులు సదరు కొత్త పెళ్లికూతురు అత్తమామలు..భర్తపై ఐపీసీ సెక్షన్ 406 (నమ్మకాన్ని ఉల్లంఘన’) సెక్షన్ 500(పరువు నష్టం) కింద కేసు నమోదు చేశామని దినయా నగర్ పోలీసులు తెలిపారు.