Threatened To Kill Urfi Javed : నటిని చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని బెదిరింపులు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
టీవీ నటి, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉర్ఫీ జావేద్ ను ఫోన్ లో పలుమార్లు బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Threatened to kill Urfi Javed
Threatened To Kill Urfi Javed : టీవీ నటి, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్ ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉర్ఫీ జావేద్ ను ఫోన్ లో పలుమార్లు బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గొరెగావ్ పోలీసుు నవీన్ గిరిని అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సహా ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్, ఇంటర్ నెట్ సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ కు నిందితుడు వాట్సాప్ ద్వారా బెదిరింపు మెసేజ్ లు పంపాడు.
Actor Siddharth: చంపేస్తామని బెదిరింపు కాల్స్.. అయినా తగ్గేదేలేదు!
మరోవైపు ఓ ప్రాజెక్టు కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఉర్ఫీ జావేద్ కు అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరమైన దుస్తులు ధరించినందుకు గానూ ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.దుబాయ్ లో బహిరంగ ప్రదేశాల్లో కురుచ దుస్తులను అనుమతించరు.