Covid Cases In Mumbai : ముంబైలో కొనసాగుతున్న కోవిడ్ సునామీ..ఇవాళ కూడా భారీగా

 ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా

Covid Cases In Mumbai : ముంబైలో కొనసాగుతున్న కోవిడ్ సునామీ..ఇవాళ కూడా భారీగా

Mumbai12

Updated On : January 7, 2022 / 9:43 PM IST

Covid Cases In Mumbai : ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి నుంచి ముంబైలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇవే అత్యధికం. కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముంబైలో గురువారమే మొదటిసారిగా కోవిడ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది.

అయితే ఇవాళ నమోదైన కేసుల్లో 84శాతం(17,616)అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారులు తెలిపారు. ఇవాళ 1395మంది కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్ లో చేరారని,వీరిలో 88మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవరసమైనట్లు తెలిపారు. ఇక,తాజా కేసులతో కలిపి ముంబైలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,74,780కి చేరింది. కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముంబైలో గురువారమే మొదటిసారిగా కోవిడ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది.

మరోవైపు,మహారాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 40,925. గురువారం కంటే ఇవాళ 13శాతం కేసులు పెరిగాయి. ఇవాళ మహారాష్ట్రలో 20 మరణాలు నమోదయ్యాయి.

ALSO READ Covid Vaccination : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..150కోట్ల డోసుల పంపిణీ