Covid Vaccination : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..150కోట్ల డోసుల పంపిణీ

దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

Covid Vaccination : వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయి..150కోట్ల డోసుల పంపిణీ

Vaccination

Covid Vaccination :  దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. మొదటి, రెండో డోసు కలిపి మొత్తం 150 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే 90 శాతానికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు. మరికొన్ని రాష్ట్రాలలో 80 శాతం రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తైంది.

భారత్ నేడు 150 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందించడంలో ఒక చారిత్రక మైలురాయిని చేరుకుందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ తయారీదారులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఎంతో మంది కృషి వ‌ల్లే దేశంలో సున్నా నుంచి ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఈ ప్ర‌యాణంలో గొప్ప మైలురాయిని సాధించగలిగిందని ప్రధాని తెలిపారు. దేశంలోని అర్హత కలిగిన వ్య‌క్తుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 90 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందింద‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు.

ఈ ఏడాది ప్రారంభంలో (జనవరి 3) నుంచి 15-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మం మొద‌లైంద‌ని తెలిపారు. తొలి 5 రోజుల్లోనే… 1.5 కోట్ల మందికి పైగా పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అందించార‌ని తెలిపారు. త్వరలోనే దేశ ప్రజలందరికీ టీకా అందిస్తామని మోదీ అన్నారు. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ విజయాన్ని అందుకోవడం ధనిక, అభివృద్ధి చెందిన దేశాలకూ సాధ్యం కాదు.

ALSO READ Italy Flight : ఇటలీ నుంచి పంజాబ్ కు మరో విమానం..ఈసారి 150మందికి కరోనా